Success Story: దేనినైనా సాధించటం అంత సులువు కాదు. చూసేవాళ్లకి చెప్పవావళ్లకి సాధించటం సులువుగా కనిపించినప్పటికీ.. అందులో దిగిన వాడికే అసలు కష్టాలు తెలుస్తాయని మన పెద్దవాళ్లు ఎల్లప్పుడూ చెబుతూనే ఉంటారు. అయితే వీటిన్నింటినీ దాటుకునే విజయం సాధించేవాడే వ్యాపారవేత్త అంటే..
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది దిగ్విజయ్ పాండే జీవితం గురించే. అతను తన 18 ఏళ్ల వయస్సులో స్వగ్రామం బీహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని "టాకియా" నుంచి కలలను నిజం చేసుకోవాలని ముంబై మహా నగరానికి చేరుకున్నాడు. అలా కొత్త నగరంలో ఉద్యోగం పొందేందుకు తొలుత కష్టాలు పడ్డాడు. కానీ తర్వాత అతను వాచ్‌మెన్‌గా తన మొదటి ఉద్యోగాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత అతడు పుస్తకాల సేల్స్‌మెన్‌గా, కార్ సేల్స్‌మెన్‌గా పనిచేశాడు.

మంచి మాటకారి. దీంతో తన సేల్స్ స్కిల్స్ ఉపయోగించి మారుతీ షోరూమ్‌లో చేరాడు. అక్కడితో ఆగిపోకుండా 2014లో మెర్సిడెస్-బెంజ్ షోరూమ్‌లో చేరి కార్పోరేట్ సేల్స్ బిజినెస్ హెడ్‌గా మారాడు. లక్షల్లో జీతం వస్తున్నా తానే సొంతంగా ఏదైనా ప్రారంభించాలని తహతహలాడేవాడు. అలా మార్కెట్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయని వెతుకున్నప్పుడు కూరగాయలకు సంబంధించిన ప్రత్యేకమైన స్టార్టప్ వచ్చింది. అలా తొలుత తన ఫ్లాట్ లోనే ఇద్దరు పనివారితో కట్ చేసిన తాజా కూరగాయలను విక్రయించటం ప్రారంభించాడు.
అలా పుట్టిందే అతని స్టార్టప్ Cartz Fresh. 34 ఏళ్ల వయస్సులో దిగ్విజయ్ 2020 మార్చ్‌లో కోవిడ్ దారుణంగా దెబ్బ తిన్నప్పుడు తన ఫ్లాట్ బాల్కనీ నుంచి ఈ వ్యాపారం చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం కంపెనీ పండ్లు, కూరగాయలు, మెులకలు వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది. వీటిని డన్జో, జెప్టో, నేచర్ బాస్కెట్, టాటా స్టార్ బజార్ వంటి అనేక ఫ్లాట్ ఫారమ్‌లతో పాటు ఇతర రిటైల్ స్టోర్లలో సైతం విక్రయిస్తోంది. ఈ క్రమంలో అనేక మంది మహిళలకు ఉపాధిని కలిగిస్తున్నాడు. తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు సీడ్ ఫండింగ్ కూడా పొందే పనిలో ఈ స్టార్టప్ ఉంది.


Click it and Unblock the Notifications