Success Story: ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ స్టార్టప్ కంపెనీల విషయంలో 3వ స్థానంలో ఉంది. ఈ క్రమంలో పుట్టుకొస్తున్న ఫిన్ టెక్ కంపెనీలు యువత నైపుణ్యాలను బయటకు తీసుకొస్తున్నాయి.
అలా సాధారణ రైతు కుటుంబంలో జన్మించి సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా మారిన యువకుడి సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఓ రైతు బిడ్డ లలిత్ కేశేరే. లక్షల్లో జీతం పొందుతున్న అతడు 2016లో ఫ్లిప్‌కార్ట్‌లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత పెట్టుబడుల ఫిన్ టెక్ గ్రో స్టార్టప్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం యాక్టివ్ యూజర్ల పరంగా గ్రో రోజురోజుకు పెరుగుతున్నట్లు తాజాగా వెల్లడైంది.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న గ్రో యాక్టివ్ ఇన్వెస్టర్ల పరంగా ప్రఖ్యాత డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థ జెరోధాను అధిగమించింది. అలా దేశంలో అగ్ర బ్రోకరేజ్ సంస్థగా అవతరించింది. తాజాగా సెప్టెంబర్ చివరి నాటికి GROWW వినియోగదారుల సంఖ్య 66.3 లక్షల మందికి చేరుకుందని ఎన్ఎస్ఈ డేటా ప్రకారం వెల్లడైంది. అయితే జెరోధా ఇప్పటికీ లాభాల పరంగా దేశంలోనే అతిపెద్ద బ్రోకింగ్ సంస్థగా కొనసాగుతోంది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటాను పరిశీలిస్తే.. FY 2021లో Groww యాక్టివ్ యూజర్ల సంఖ్య కేవలం 7.8 లక్షలు మాత్రమే. తాజాగా జెరోధా యాక్సివ్ వినియోగదారుల సంఖ్య 64.8 లక్షలను ఇది అధిగమించింది. రానున్న సమీప కాలంలో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గ్రో బ్రోకరేజ్ తన ఖాతాదారులకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, IPOలు, US స్టాక్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఫిక్సెడ్ డిపాజిట్లు వంటి పెట్టుబడి సేవలను ఒకే గొడుగు కింద అందిస్తోంది.
తాను గ్రోను స్నేహితులు హర్ష్ జైన్, ఇషాన్ బన్సాల్, నీరజ్ సింగ్‌ల సహకారంతో ప్రారంభించానని లలిత్ తెలిపారు. 12వ తరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివిన అతడు తర్వాత ఐఐటీలో చదువు పూర్తి చేశాడు.


Click it and Unblock the Notifications