Success Story: రూ.800 కోట్ల కంపెనీ యజమానిగా మారిన ఆటో వాలా.. సక్సెస్ స్టోరీ..
Success Story: విజయవంతమైన వ్యాపారిగా మారటం అనేది అంత సులువైనది కాదు. ప్రపంచంలో అనేక మంది ఈ కలలను కలిగి ఉంటారు. అయితే కొంత మంది మాత్రమే వాటిని అందుకునేందుకు నిరంతరమైన శ్రమ, శ్రద్ధను కలిగి ఉంటారు.
ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నది బెంగళూరుకు చెందిన సత్య శంకర్ నిరాడంబరమైన ప్రయాణం గురించే. ఆయన పుత్తూరు దగ్గర బెల్లారె గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆటో డ్రైవర్‌గా పనిచేసిన సత్య శంకర్ ధీరూబాయ్ అంబానీ నుంచి వ్యాపారం విషయంలో భారీగా ప్రేరణను పొందారు. తనకు అస్సలు పరిచయం లేని సాఫ్ట్ డ్రింక్స్ రంగంలో స్వయం ఉపాధిని పొందేందుకు అడుగుపెట్టారు.

కేవలం ఏడాదిలో శంకర్ తన ఆటో రుణాన్ని చెల్లించటంతో వ్యాపార చతురతను ప్రదర్శించాడు. అలా ఆటో రిక్షా నుంచి అంబాసిడర్ కారు స్థాయికి వెళ్లాడు. కానీ టాక్సీ డ్రైవర్ గా అతను సంతృప్తి చెందలేదు. 1987 నాటికి అతను ఆటోమొబైల్ గ్యారేజ్ పరిశ్రమలోకి మారి టైర్ డీలర్‌షిప్‌ను స్థాపించాడు. అలా అతని భవిష్యత్తు విజయానికి పునాది పడింది. 2002లో శంకర్ ఉత్తర భారత పర్యటనతో టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఈ క్రమంలో పుట్టిందే బిందు జీరా మసాలా సోడా(Bindu Jeera Masala Soda) వ్యాపార ఆలోచన. జీలకర్రతో ప్రత్యేకమైన పానీయాన్ని అందరికీ రుచిచూపించాలని శంకర్ నిర్ణయించారు.
35 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన కంపెనీ టర్నోవర్ 2006 నాటికి రూ.6 కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత 2010లో కంపెనీ వ్యాపారం రూ.100 కోట్ల మైలురాయిని అందుకుని భారత బివరేజ్ వ్యాపారంలో కొత్త సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత కంపెనీ 2015లో సింగపూర్, యూఏఈ, మలేషియా వంటి అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించింది. కంపెనీ వినూత్నమైన విజయం కారణంగా ప్రస్తుతం ఈ వ్యాపారం విలువ రూ.800 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications