Success Story: నిజంగా రిస్క్ తీసుకున్న వాడే జీవితంలో గొప్ప విజయాన్ని అందుకోగలని వింటుంటాం. కానీ అది సంజీవ్ బిఖ్‌చందానీ జీవితంలో కనిపిస్తుంది. ఉద్యోగాన్ని వీడి సొంతంగా వ్యాపారం చేయాలని పుట్టిన ఆలోయన సక్సెస్ కావటంతో ప్రస్తుతం కోటీశ్వరుడిగా మారిపోయారు.
కలలను నెరవేర్చుకోవడానికి మనస్పూర్తిగా కష్టపడితే సరిపోతుందని సంజీవ్ బిఖ్‌చందానీ సక్సెస్ నిరూపించింది. ఏదైనా పెద్దది చేయాలని మనలోనూ చాలా మందికి ఉంటుంది.. అయితే ప్రారంభం అంత సులువుగా ఉండదనేది వాస్తవం. అయితే సంజీవ్ బిఖ్‌చందానీ తన భార్య సురభి మద్దతుగా నిలవటంతో తన వ్యాపార ఆలోచనను ముందుకు తీసుకెళ్లాడు. తన కలల వ్యాపారం కోసం కొన్ని ఏళ్ల పాటు నిరంతరం శ్రమించాడు.

అలా ప్రస్తుతం మనందరికీ ఎంతో సుపరిచితమైన జాబ్ సైట్ Naukri.com, వివాహానికి జీవిత భాగస్వామిని వెతుక్కునేందుకు ఉపయోగించే Jevansathi.com వెబ్‌సైట్‌లను నడుపుతున్న ఇన్ఫో ఎడ్జ్ అనే కంపెనీకి సంజీవ్ యజమానిగా ఉన్నారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో చదువు పూర్తైన తర్వాత సంజీవ్ ప్రముఖ కంపెనీలో ఉద్యోగిగా మారగా.. భార్య సైతం ఓ కంపెనీలో పనిచేసేది. 1990లో సొంత వ్యాపారం చేయాలనుకున్నప్పుడు భార్య సురభి జీతం ఇంటి పోషనకు ఉపయోగిపడింది. ఆ సమయంలో బిక్‌చందానీ తన తండ్రి గ్యారేజీలో సెకండ్ హ్యాండ్ కంప్యూటర్, పాత ఇంటి ఫర్నిచర్‌తో ఇన్ఫో ఎడ్జ్(ఇండియా)ని ప్రారంభించాడు.
స్నేహితులు బంధువులు సమయం వృధా చేస్తున్నాడంటూ నిరుత్సాహపరిచినా ముందుకే కొనసాగాడు. అలా 10 ఏళ్లు కష్టపడి నిర్మించిన Naukri.com అతని జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. ప్రస్తుతం సంజీవ్ కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా మార్కెట్ క్యాప్ రూ.57,500 కోట్లకు చేరుకుంది. అలాగే ఫోర్బ్స్ జాబితా ప్రకారం అతని నికర విలువ రూ.19,000 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. అందుకే సరైన దారిలో వెళుతూ కృషి చేస్తే విజయం తప్పక వరిస్తుందని పెద్దలు చెబుతుంటారు.


Click it and Unblock the Notifications