Carrot Farming: దేశంలో రైతులు ఇటీవలి కాలంలో పాత పద్దతులను మార్చుకుని లాభాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఏడాదికి కోటి ఆదాయంగా పొందుతున్న పంజాబీ రైతు సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు తెలుసుకోబోతున్నది పంజాబ్ కపుర్తలాలోని పరమజిత్‌పురా గ్రామానికి చెందిన రైతు భూమన్ సింగ్ గౌరా గురించే. దశాబ్ధాల పాటు సాంప్రదాయ వ్యవసాయంలో ఉన్న ఆయన జీవితాన్ని క్యారెట్ సాగు మార్చేసింది. 6 మంది తోబుట్టువులలో చిన్నవాడైన భూమన్ సింగ్ తండ్రి తాతల దారిలో వ్యవసాయాన్నే నమ్ముకున్నాడు. అయితే వరి సాగు నుంచి క్యారెట్ సాగుకు మారిన సింగ్ గౌరా ఇప్పుడు ఏడాదికి కోటి రూపాయల వరకు సంపాదిస్తూ కుటుంబ జీవన ప్రమాణాన్ని పెంచారు.

భూమన్ సింగ్ బీఏ రెండో సంవత్సరం తర్వాత చదువు ఆపేయాల్సి వచ్చింది. కాలేజీ ఫీజు కట్టలేక ఆయన తన కుటుంబంతో కలిసి వరి, గోధుమ పొలాల్లో పని చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలోనే క్యారెట్ సాగు గురించి ఆసక్తి కలిగింది. కపుర్తలా జిల్లాలోని అల్లుపూర్ అంటే పరమజిత్‌పురా క్యారెట్ సాగుకు ప్రసిద్ధి. అందుకే తాను కూడా క్యారెట్ సాగులో విజయం సాధించాలని భావించి తొలుత కొద్దిపాటి భూమిలో కూరగాయలు సాగు చేస్తున్న రైతును ఆశ్రయించాడు. అయితే సదరు రైతు నుంచి ఎలాంటి సహకారం అందలేదు.
అయితే పట్టువదలని భూమన్ క్యారెట్ వ్యవసాయానికి మారి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో తొలుత 4.5 ఎకరాల భూమిలో క్యారెట్ సాగు ప్రారంభించాడు. నేడు భూమన్ కుటుంబం ఈ సాగును 80 ఎకరాలకు విస్తరించింది. వారి కుటుంబం కేవలం క్యారెట్ పండించడమే కాకుండా విత్తనాలను కూడా విక్రయిస్తోంది. చిన్నప్పుడు బాగా చదువుకుని విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలని కలలు కన్న భూమన్ సింగ్ ప్రస్తుతం స్వదేశంలోనే క్యారెట్ సాగుతో గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలా 1993లో సాగు ప్రారంభించి 30 ఏళ్లుగా విజయపరంపరను కొనసాగిస్తున్నారు.
వాస్తవానికి ఈ విజయం సాధించటానికి వెనుక పెద్ద కసరత్తే ఉంది. అవును ఇతర రైతులు సహాయం అందించటానికి నిరాకరించిన తర్వాత పుస్తకాలు చదవటం ద్వారా క్యారెట్ సాగులోని మెళకువలు, సమస్యల గురించి భూమర్ సింగ్ తెలుసుకున్నారు. అలాగే సమీపంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అవసరమైన జ్ఞానాన్ని కూడా పొందారు. ఆ తర్వాత తన కుటుంబానికి చెందిన 4.5 ఎకరాల భూమిలో ధైర్యంగా క్యారెట్ విత్తనాలు నాటి ప్రయాణాన్ని మెుదలుపెట్టారు. నాణ్యమైన రుచికరమైన క్యారెట్ దిగుబడిలో ప్రసిద్ధి పొందటంతో విక్రేతలు పొలం వద్దకే వచ్చి సరకు కొనుక్కెళ్లటం ప్రారంభించారు.
ప్రస్తుతం భూమన్ సింగ్ క్యారెట్ విత్తనాలను కిలో రూ.1000 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నారు. మెుత్తం సాగుచేస్తున్న 80 ఎకరాల్లో.. 37 ఎకరాల భూమి భూమన్ సింగ్‌కు చెందినది. మొత్తం 50 ఎకరాల్లో క్యారెట్ సాగు చేస్తున్నారు. క్యారెట్లు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుతారు మరియు 90 నుంచి 100 రోజుల తర్వాత కోతకు సిద్ధంగా ఉంటాయి. ఎకరానికి సుమారు 110 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications