Harshad Mehta Scam: ప్రస్తుతం అనేక మంది కొందరు చూపే అత్యాసలకు పోయి ఉన్న డబ్బు పోగొట్టుకుంటున్నారు. పైగా పెరిగిన టెక్నాలజీతో పాటుగానే ఆర్థిక మోసాలు సైతం కొత్త పుంతలు తొక్కుతూ అనేక మందికి నష్టాన్ని కలిగిస్తున్నాయి.
అయితే వీటన్నింటి కంటే ముందరే 1990ల దశకంలో జరగిన హర్షద్ మెహతా స్కామ్ అతిపెద్దదిగా మార్కెట్లలో ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. 1992లో దేశాన్ని కుదిపేసిన స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా కుంభకోణంలో భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న వారిలో జార్ఖండ్‌కు చెందిన వ్యాపారవేత్త తుషార్ జైన్, అతని తండ్రి మూల్‌చంద్ జైన్ కూడా ఉన్నారు.

మెహతా కుంభకోణంతో క్షీణించిన ఆర్థిక పరిస్థితి కారణంగా వీరు తమ కుంటుంబ పోషనకు ముంబై వీధుల్లో హ్యాండ్‌బ్యాగ్‌లను అమ్మారు. విరామం లేని కృషితో 1999లో హై స్పిరిట్ కమర్షియల్ వెంచర్స్‌ను ప్రారంభించారు. తర్వాతి కాలంలో దానిని 300 స్టోర్లకు విస్తరించి చివరగా ముంబైలో స్థిరపడ్డారు. 2006 వారి వ్యాపారం భారీగా కస్టమర్లను పొందింది. అలా కస్టమర్ల కోరిక మేరకు డిజైనర్ బ్యాగులు తయారు చేస్తారు. 2007లో వారు తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకున్నారు మరియు రోజుకు 3,000-4,000 బ్యాగ్‌లను ఉత్పత్తి చేసే కర్మాగారాలను స్థాపించారు.
ప్రస్తుతం కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న తుషార్.. 2017లో Traworld, Hashtag బ్రాండ్లను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వారు ట్రావరల్డ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనమ్ కపూర్ అహుజాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశంలో కంపెనీ ప్రస్తుతం నాలుగో అతిపెద్ద రిటైల్ సంస్థగా గుర్తింపును పొందింది. 2017లో కంపెనీ రోజుకు 30,000-35,000 బ్యాగ్స్ తయారు చేయటంతో వ్యాపారం రూ.250 కోట్లకు చేరుకుంది.
ముంబై కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీకి దేశవ్యాప్తంగా 10 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. రానున్న 5 ఏళ్ల కాలంలో వ్యాపార ఆదాయన్ని రూ.1,000 కోట్లకు చేర్చాలని తుషార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏడాదికి 25 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications