Nirmit Parekh Success: జీవితంలో రియల్ సక్సెస్ ఒకరి కింద పనిచేసినంత కాలం రాదని నేటితరం యువత నిరూపిస్తున్నారు. లక్షల్లో కాదు కోట్లలో వార్షిక ప్యాకేజీలు అందించిన పొందుతున్న హై పెయిడ్ ఉద్యోగులు సైతం ప్రతిష్ఠాత్మకమైన కంపెనీల్లో కంఫర్టబుల్ జాబ్స్ మానేసి తమ డ్రీమ్స్ ఛేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వారి విజయగాథలు చాలా మంది యువతకు స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నిర్మిత్ పరేఖ్ సక్సెస్ స్టోరీ గురించే. చాలా మంది విదేశాల్లో తమకు సక్సెస్ ఫుల్ కెరీర్ నిర్మించుకునే పనిలో ఉండగా మరికొందరు మాత్రం తమ సొంత దేశానికి వచ్చి డ్రీమ్ జర్నీని స్టార్ట్ చేస్తుంటారు. అలా స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న పరేఖ్ ఆపిల్ కంపెనీలోని హై పెయిడ్ ఉద్యోగాన్ని మానేసి ఇండియాకు వచ్చేశాడు. అలా అప్నా పేరుతో నిర్మించిన స్టార్టప్ కంపెనీ చాలా తక్కువ సమయంలోనే మల్టీ బిలియన్ డాలర్ల విలువకు చేసుకుని వేగంగా యూనీకార్స్ స్టేటస్ సంపాదించింది. దీంతో పరేఖ్ యంగెస్ట్ బిలియనీర్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. వేల మందికి తన కంపెనీ ద్వారా ప్రస్తుతం ఉపాధిని అందిస్తున్నారు.

21 ఏళ్ల వయస్సులో ఉన్న సమయంలో నిర్మిత్ తన తొలి స్టార్టప్ ముంబై కేంద్రంగా ప్రారంభించాడు. దీనికి ముందు కేవలం 7 ఏళ్ల వయస్సులో డిజిటల్ క్లాక్ సర్క్యూట్‌ను నిర్మించాడు. 13 ఏళ్లు వచ్చేసరికి ప్రోగ్రామింగ్, రోబోటిక్స్ నేర్చుకుంటున్నాడు. 2009లో 21వ ఏట Incone Technologies పేరుతో ఒక ఫ్లడ్ మేనేజ్మెంట్ ఫోకస్డ్ కంపెనీని ప్రారంభించాడు. తర్వాత ప్రారంభించిన Cruxbox కంపెనీని ఇంటెల్ సంస్థకు విక్రయించాడు. అతను అమెరికాలోని ఇంటెల్‌లో డేటా అనలిటిక్స్ డైరెక్టర్‌గా పనిచేసిన తర్వాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు. దీని తర్వాత ఆపిల్ కంపెనీలో ఐఫోన్ ఉత్పత్తుల స్టాటజీటీమ్‍లో వర్క్ చేశాడు. ఈ క్రమంలోనే ఇండియన్ బ్లూకాలర్ జాబ్ రంగంలో ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించాడు.
అలా ఆపిల్ కంపెనీలో ఉద్యోగం మానేసి ఇండియా వచ్చిన తర్వాత పరేఖ్ బ్లూ కాలర్ ఉద్యోగులను కంపెనీలతో అనుసంధానించే ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించడంపై ఫోకస్ పెట్టాడు. ఈ కీలకమైన లేబర్ మార్కెట్‌లోని అంతరాలను పరిష్కరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. అలా తాజా గ్రాడ్యుయేట్లు, అనుభవజ్ఞులైన నిపుణులు వివిధ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలను కనుగొనడంలో సహాయపడుతున్నాడు. అలా కరోనాకి ముందు Apna పేరుతో ప్లాట్ ఫారమ్ స్టార్ట్ చేశారు.
ఇది దేశంలోని బ్లూ కాలర్ ఉద్యోగార్ధులకు, అసంఘటిత రంగంలోని యజమానులకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి రూపొందించబడిన వేదిక. కంపెనీ విలువ కేవలం 22 నెలల్లోనే 1.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఉద్యోగం కోసం వెతుకున్న ప్రతిభావంతులను యజమానులకు అనుసంధానించడానికి ప్లాట్‌ఫారమ్ ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం అప్నాలో 150000 రిజిస్టర్డ్ కంపెనీలు ఉన్నాయి. అనాకాడెమీ, బిగ్‌బాస్కెట్, లైసియస్, వైట్‌హాట్ జూనియర్, ఫ్లిప్‌కార్ట్, షాడోఫాక్స్, జొమాటో, డెలివేరీ, బర్గర్ కింగ్ వంటి ప్రతిష్ఠాత్మకమైన కంపెనీలు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications