Success Story: తండ్రికి సాయంగా వచ్చింది.. రూ.11,120 కోట్ల కంపెనీ నిర్మించింది, 22 ఏళ్లకే..

Ameera Shah Success: నేటి కాలంలో కొందరు తమ సొంత ఆలోచనలను వ్యాపారంగా మార్చుతూ స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ సున్నా నుంచి ప్రయాణాన్ని మెుదలుపెట్టాల్సిన అవసరం ఉంటుందని తెలిసిందే. కానీ మరికొందరు తమ ఫ్యామిలీ పూర్వీకులు ప్రారంభించిన సంస్థలను చిన్న స్థాయి నుంచి పెద్ద కార్పొరేట్ కంపెనీల స్థాయికి వృద్ధి చేస్తున్నారు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అమీరా షా సక్సెస్ స్టోరీ గురించే. ప్రస్తుతం ఆమె మెట్రోపాలిస్ హెల్త్ కేర్ కంపెనీకి ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె నాయకత్వంలో కంపెనీ దేశంలోనే అతిపెద్ద డయాగ్నస్టిక్స్ ల్యాబ్ చైన్ గా విస్తరించింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.11,120 కోట్లుగా లెక్కించబడింది. కంపెనీ ప్రస్తుతం విస్తృత శ్రేణి క్లినికల్ లేబొరేటరీ పరీక్షలు, వెల్నెస్ సేవలను అందిస్తోంది. దీనికి ముందు ఆమె అమెరికాలోని గోల్డ్‌మన్ సాచ్స్‌తో తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే ఇండియాకు తిరిగి రావాలనే నిర్ణయంతో అమీరా తన తండ్రి డాక్టర్ సుశీల్ షా నడుపుతున్న పాథాలజీ వెంచర్‌ నిర్వహణ బాధ్యతలు అందిపుచ్చుకున్నారు.

Know success story of Ameera Shah who took fathers diagnostics businees to next orbit

అలా ఆమె తన 22 ఏళ్ల వయస్సు 2001లో కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె నికర విలువ దాదాపు రూ.5,950 కోట్లుగా ఉంది. అమీరా షా ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి చదువుకుంది. అలాగే ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఫైనాన్స్‌లో విద్యను పూర్తి చేసింది.

కంపెనీ వ్యాపారం..
మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ 1981లో స్థాపించబడిన భారతీయ ప్రముఖ డయాగ్నోస్టిక్స్ సేవల సంస్థ. ప్రస్తుతం కంపెనీ ల్యాబ్స్ దేశంలోని 22 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 700 పట్టణాలకు విస్తరించాయి. మెట్రోపాలిస్ క్యాన్సర్, నాడీ సంబంధిత రుగ్మతలు, అంటు వ్యాధులు, వివిధ జన్యుపరమైన అసాధారణతల నిర్ధారణ కోసం అధునాతన పరీక్షలతో సహా 4,000 కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 202 ల్యాబ్‌లు, 4,336 సర్వీస్ సెంటర్‌లు, 10,000కి పైగా టచ్ పాయింట్లతో బలమైన నెట్‌వర్క్‌ కలిగి ఉంది. నాణ్యత హామీ కోసం ప్రపంచవ్యాప్తంగా టాప్ 1% ప్రయోగశాలలలో ఒకటిగా నిలిచింది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+