Success Story: అమెరికా జాబ్ మానేసిన లేడీ.. రూ.100 కోట్ల కంపెనీ సృష్టి.. రియల్ సక్సెస్

Ahana Gautam: గత దశాబ్దకాలంగా ఇండియాలో స్టార్టప్ కల్చర్ ఊపందుకుంది. దీంతో చాలా మంది యువత తమకు నచ్చిన పని చేసుకునేందుకు ఉద్యోగాలను మానేస్తున్నారు. అలా సొంత వ్యాపారాలను ప్రారంభించి బిగ్ సక్సెస్ కొడుతున్నారు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఒక లేడీ సక్సెస్ స్టోరీ. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన అహానా ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత 2014-16 మధ్య కాలంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో MBA పూర్తి చేసింది. యూఎస్ లో ఒక హోటల్‌కు వెళ్లినప్పుడు అధిక కొవ్వు, క్రీముతో కూడిన ఆహారాలను చూసి విసిగిపోయింది. దీని నుంచే ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రజలకు అందించాలని తనకు తోచింది.

Know Success Story of Ahana Gautam founder of Health snacks brand Open Secret worth 100 Cr

దీంతో సొంతంగా తానే పౌష్టిక ఆహార ఉత్పత్తులను తయారు చేసి తనలాంటి ఆరోగ్య ప్రియులకు అందించాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచనతో ఓపెన్ సీక్రెట్ పేరుతో రుచికరమైన పోషకాలతో కూడిన చిరుతిళ్లను ఉత్పత్తి చేసే కంపెనీని నిర్మించింది. బయట దొరుకుతున్న ఫ్యాటీ ఫుడ్స్ కు దూరంగా జరగాలనుకునే వారికి ప్రస్తుతం అహానా ఉత్పత్తులు ప్రజలకు ఆకట్టుకున్నాయి. దీనికి తోడు అహానా ఉత్పత్తులు గొప్ప రుచి మరియు పోషకాహారాన్ని కలిగి ఉన్నందున వ్యాపారం ఊపందుకుంది.

30 ఏళ్ల వయస్సులో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించిన అహానా ప్రస్తుతం OpenSecret కంపెనీకి సీఈవోగా కొనసాగుతున్నారు. అమెరికాలో భారీగా సంపాదిస్తున్నప్పటికీ ఆ ఉద్యోగాన్ని వదిలేసి ప్రస్తుతం రూ.100 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తుల సంస్థను విజయవంతంగా కొనసాగిస్తోంది. దీనికోసం 2019లో తల్లి నుంచి వ్యాపారానికి అవసరమైన నిధులను సేకరించింది.

Know Success Story of Ahana Gautam founder of Health snacks brand Open Secret worth 100 Cr

అహానా గోద్రెజ్ టైసన్ ఫుడ్స్ లిమిటెడ్ బోర్డులో ఇండిపెండెంట్డైరెక్టర్ కూడా. అలాగే నాలుగు సంవత్సరాలు ప్రోక్టర్ అండ్ గాంబుల్‌లో పనిచేశారు. కృత్రిమ రంగులు, రుచులు, శుద్ధి చేసిన చక్కెరతో కూడిన జంక్ ఫుడ్ నుంచి భారతీయులను పూర్తిగా పోషకమైన ఆరోగ్యాన్ని అందించే సాంప్రదాయ స్నాక్స్ వైపు మళ్లించాలని అహానా లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+