Adobe Ceo: ప్రస్తుత గ్లోబలైజేషన్ సమయంలో కంపెనీలు ప్రతిభ కలిగినవారికే పట్టం కడుతున్నాయి. ఈ క్రమంలో చాలా అమెరికన్ టెక్ కంపెనీలకు నాయకత్వం వహించే బాధ్యతలు భారత సంతతికి చెందిన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. అలా తెలుగు గడ్డపై పుట్టి అంతర్జాతీయ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తి విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం.

మన హైదరాబాదీ..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది అడోబ్ సీఈవో శంతను నారాయణ్ గురించే. ఆయన ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ కంపెనీ అడోబ్ సిస్టమ్స్‌కి నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యాపార నిర్వాహకుల్లో ఒకరిగా శంతను నిలిచారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చదివారు. బర్కిలీలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు.

ఆపిల్ కంపెనీతో కెరియర్ స్టార్ట్..
తెలుగు తేజం శంతను నారాయణ్ సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన ఐఫోన్ మేకర్ ఆపిల్ కంపెనీలో తన తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత పిక్ట్రా పేరుతో ఒక కంపెనీని సొంతంగా ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని మొట్టమొదటి ఇంటర్నెట్ ఫోటో షేరింగ్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి కావటం విశేషం. ఈ కంపెనీని విజయవంతంగా నడిపి సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ఫోటో షేరింగ్ రంగంలో అతని కృషి 1998లో అడోబ్ సిస్టమ్స్‌లో చేరేలా చేసింది.

కేవలం 10 ఏళ్లలో..
అడోబ్ సిస్టమ్స్ కంపెనీలో 10 ఏళ్ల పాటు వివిధ స్థాయిల్లో పనిచేసిన తర్వాత శంతను నారాయన్ కంపెనీకి సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. తొలుత ఆయన అడోబ్‌లో గ్లోబల్ ప్రొడక్ట్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కెరీర్ ప్రారంభించారు. శంతను రాకతో అడోబ్ పురోగతి కొత్త పుంతలు తొక్కింది. కంపెనీ లాభాలు, ఆదాయం అనేక రెట్లు పెరిగింది. కంపెనీ దాదాపుగా 350 విజయవంతమైన ఒప్పందాలను కలిగి ఉంది. అడోబ్ ఫ్లాష్ ప్లే కు నారాయణ్ బాధ్యతలు వహిస్తున్నారు.

హైదరాబాద్ సదస్సులో..
ఇటీవల తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగిన టై గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవానికి అడోబ్ సీఈవో శంతను నారాయణ్ అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం వ్యాపార వాతావరణం చాలా బాగుందని.. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, కార్యదర్శి జయేష్ రంజన్ కృషిని అభినందించటం దేశంలో హైదరాబాద్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుతోంది. ప్రస్తుత కాలంలో తాను పుట్టి హైదరాబాద్‌లో పెరిగి ఉంటే ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లేవాడిని కాదని సమావేశంలో ఆయన అనటం భారత ఐటీ పురోగతిలో హైదరాబాద్ పాత్రకు అద్ధం పడుతోంది.

వార్షిక వేతనం..
అడోబ్ కంపెనీలో సీఈవోగా ఉన్న శంతను ఏడాదికి రూ.4,500 కోట్లను జీతనంగా అందుకుంటున్నారు. ఆయన మెుత్తం ఆస్తి విలువ దాదాపుగా రూ.85,000 కోట్లుగా ఉందని తెలుస్తోంది. 2013లో శంతను జీతం 15.7 మిలియన్ డాలర్లుగా ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications