Abhinav Singh Success: ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీల పెత్తనానికి మెల్లగా బీటలు వారుతున్నాయి. అనేక రంగాల్లో యువత చిన్న వ్యాపారాలను స్టార్ట్ చేస్తూ తమకు నచ్చిన పని చేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో యువత మైక్రోసాఫ్ట్ లాంటి అగ్ర కంపెనీలలో సైతం తమ ఉద్యోగాలను వదులుకుంటున్నారు. ఏటా లక్షల ప్యాకేజీలను ఇచ్చే జాబ్స్ కాదని వ్యాపార మూలాలపై ఫోకస్ పెడుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అభినవ్ సింగ్ అనే యువ వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ గురించే. వాస్తవానికి అభినవ్ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అందరి లాగానే పేరు ప్రఖ్యాతులు ఉన్న కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఈ క్రమంలో చివరిగా అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీలో రూ.80 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని చేశాడు. అయితే ఈ క్రమంలో సొంతంగా తన వ్యాపారవెంచర్ ప్రారంభించాలని అనుకున్నాడు. దీంతో తాను చేస్తున్న హై పేయింగ్ జాబ్ మానేసి నచ్చిన పనిచేయాలని అనుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అజంగఢ్ జిల్లా, చిల్బిలా అనే గ్రామానికి చెందిన అభినవర్ గురుగ్రాములోని మైక్రోసాఫ్ లో 2014లో ఇండియాకి వచ్చిన తర్వాత కొన్నాళ్లు పనిచేశాడు.

అయితే 2016లో తన పూర్వీకులకు సంబంధించిన స్థలంలో వ్యవసాయం చేయాలని నిర్ణయించాడు. స్థానిక ప్రజలకు మద్ధతులగా నిలవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో మొదట్లో సేంద్రీయ కూరగాయల సాగును ప్రయత్నించగా అది ఊహించిన స్థాయిలో టేకాఫ్ కాలేదు. అయితే దీంతో నిరాశకు గురికాని అభినవ్ జెర్బెరా పువ్వులలోని సామర్థ్యాన్ని కనుగొన్నాడు. అలంకరణలకు ప్రసిద్ధి చెందిన ఈ రంగురంగుల పువ్వులకు డిమాండ్ ఉన్నప్పటికీ స్థానికంగా పెద్దగా పెరగడం లేకపోవటం గమనించి మంచి వ్యాపార అవకాశంగా భావించాడు. ఇందుకోసం 58,16,000 వెచ్చించి.. 4,000 చదరపు మీటర్ల పాలీహౌస్ నిర్మించాడు. ఇందుకోసం ఎక్కువ మెుత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా పొందాడు.
అలా అక్టోబర్ 2020లో ప్రారంభమైన పూల సాగు ఫిబ్రవరి 2021లో మొదటి పంట విజయవంతమైన వ్యాపారానికి నాంది పలికింది. ఒక్క సంవత్సరంలో నెలకు రూ.1.5 లక్షలు సంపాదించటం ప్రారంభించాడు. అతడు పూలు సాగుచేస్తున్న పొలంలో స్వగ్రామానికి చెందిన దాదాపు 100 మందికి ఉద్యోగాలను కల్పించాడు. అయితే ఈ ప్రయాణాన్ని అభినవ్ డబ్బు కంటే ఎక్కువగా భావిస్తున్నాడు. అతను తన కమ్యూనిటీకి సహాయం చేస్తున్నందుకు, కుటుంబానికి దగ్గరగా ఉన్నందుకు గర్వపడుతున్నాడు. ఇతరులకు జీవనోపాధి కల్పించడం, సొంత ఊరిలో ఏదో ఒక ప్రత్యేకత చేయడం వల్ల కలిగే ఆనందాన్ని డబ్బుతో భర్తీ చేయలేమని పేర్కొన్నాడు. సింగ్ తన వ్యవసాయాన్ని విస్తరించాలని, ఫార్మింగ్ టూరిజాన్ని ప్రోత్సహించాలని కలలు కంటున్నాడు. స్థానిక వ్యవసాయం మరియు సమాజ సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చేలా ఇతర రైతులను ప్రేరేపించడం అతని లక్ష్యంగా అభినవ్ ముందుకు సాగుతున్నాడు.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications