Success Story: జీవితంలో మనదగ్గర ఏమీ లేనప్పటికీ మనం చేయాల్సిన కష్టం మనం చేస్తే భవిష్యత్తులో మనం పొందాల్సింది పొందుతామని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. చిన్నగా మెుదలెట్టడం తప్పు కాదు.. దానిని క్రమంగా పెద్దది చేస్తూ మన కలల వైపు నడవటం గొప్ప అని ఈ సక్సెస్ స్టోరీ నిరూపిస్తోంది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది అమీర్ కుతుబ్ జీవిత విజయం గురించే. అతను ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించాడు. ఒకప్పుడు విమానాశ్రయంలో స్వీపర్‌గా పనిచేసినన అమీర్ కుతుబ్ ప్రస్తుతం ఒక కంపెనీకి యజమానిగా మారాడు. తన సంస్థలో 100 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. న్యూస్ పేపర్ బాయ్ నుంచి స్వీపర్ వరకు అనేక పనులు చేసిన అతడు జీవితంలో 300 సార్లకు పైగా ఉద్యోగాల తిరస్కరణకు గురయ్యాడు. అతడి జీవితం నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది.

సామాన్య కుటుంబంలో పుట్టిన అమీర్ కుతుబ్ జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. 12వ తరగతి తర్వాత అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో ప్రవేశం పొందాడు. చదువు తర్వాత దిల్లీలో కంపెనీలో జాబ్ చేస్తున్నప్పటికీ సంతృప్తి లేదు. సొంతంగా వ్యాపారం చేయాలని అనుకునేవాడు. దీంతో ఉద్యోగం విడిచి ఫ్రీలాన్సర్‌గా వెబ్‌సైట్ డిజైన్ వర్క్ చేయడం ప్రారంభించాడు. అతనికి ఆస్ట్రేలియా, అమెరికాలో కూడా కొంతమంది క్లయింట్లు ఉన్నారు. అలా స్టూడెంట్ వీసాతో ఆస్ట్రేలియా వెళ్లాడు.
ఆస్ట్రేలియాలో అనేక ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసినప్పటికీ నిరాశే ఎదురైంది. 4 నెలల్లో 170 ఇంటర్వ్యూలకు హాజరైనా లాభం లేకపోయింది. ఎందుకంటే అతనికి ఇంగ్లీష్ పెద్దగా రాదు. ఆ తర్వాత ఎయిర్ పోర్టులో క్లీనర్ ఉద్యోగం సంపాదించాడు. ఇదే సమయంలో పార్ట్ టైమ్ న్యూస్ పేపర్ పంపిణీ చేసేవాడు. అలా కాలేజీ చివరి సంవత్సరంలో అదృష్టం మారిపోయింది. టెక్నాలజీ కంపెనీలో ఇంటర్న్‌షిప్ రాగా.. 15 రోజుల్లోనే ఆపరేషన్స్ మేనేజర్‌గా పదోన్నతి పొందాడు.
కుతుబ్ రెండేళ్ల తర్వాత కంపెనీ తాత్కాలిక జనరల్ మేనేజర్‌గా నియమించారు. ఈ కాలంలో కుతుబ్ ఒకసారి ఒక వ్యాపారవేత్తను కలిశాడు. అప్పుడే కంపెనీలకు డబ్బు ఆదా చేయడంలో సహాయపడే అప్లికేషన్‌ను రూపొందించాలనే ఆలోచన మనస్సులోకి వచ్చింది. అప్పుడే 2000 డాలర్ల పెట్టుబడితో ఎంటర్‌ప్రైజ్ మంకీ సంస్థను ప్రారంభించాడు. ప్రస్తుతం కంపెనీ కోట్ల టర్నోవర్ స్థాయిని అందుకుంది. వందల మంది ఉద్యోగులకు ఉపాధిని కల్పిస్తోంది. కృషితో నాస్తి దుర్భిక్షం అంటే ఇదే మరి.
More From GoodReturns

Success story: రూ. 600 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టాడు!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications