Success Story: సాధారణంగా ఈరోజుల్లో వ్యాపార ఆలోచన ఉండటం కంటే దానికి తగిన నిధులను సమీకరించి ముందుకెళ్లటం అంత ఈజీ కాదు. మన ఆలోచనపై ఉన్న నమ్మకాన్ని పెట్టుబడిదారులు ఎంత గట్టిగా విశ్వసిస్తారనేదానిపైనే ముందుకెళ్లటం ముడిపడి ఉంటుంది.
తాను బలంగా నమ్మి ప్రారంభించిన వ్యాపారంలో పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్ల నుంచి 100 సార్లకు పైగా తిరస్కరణను ఎదుర్కొన్నారు మెలానీ పెర్కిన్స్ అనే మహిళ. అయితే తిరస్కరణలతో నిరుత్సాహపడకుండా ఎట్టకేలకు ఆమె విజయం సాధించారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది.. ఫోటోలను, సీవీలను ఎడిట్ చేసేందుకు ప్రస్తుతం ఎక్కువగా వినియోగిస్తున్న ఆన్‌లైన్ అప్లికేషన్ Canva గురించే.

Canva ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రజాధరణను పొందింది. ఈ కంపెనీకి దాదాపు 190 దేశాల్లో వినియోగదారులు ఉన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు 98 శాతం మంది ఏదో ఒక విధంగా కాన్వాను ఉపయోగించారని చెప్పవచ్చు. కంపెనీ వెల్లడించిన డేటా ప్రకారం వారికి 6 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. డిజైనింగ్‌ను కాన్వా సులభతరం చేస్తూ ఇమేజ్ ఎడిటింగ్‌లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది.
ఈ ఆలోచన పుట్టిన తొలనాళ్లలో మూడేళ్ల కాలంలో 100 మందికి పైగా ఇన్వెస్టర్లు తిరస్కరించినప్పటికీ మెలానీ పెర్కిన్స్ అచంచలమైన నిబద్ధత చివరకు ఫలించింది. ప్రస్తుతం కంపెనీ విలువ 40 బిలియన్ డాలర్లుగా ఉంది. కాన్వాతో మెలానీ పెర్కిన్స్ ప్రయాణం 19 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు 2007లో ఆస్ట్రేలియా డెస్క్‌టాప్ డిజైన్ సాఫ్ట్‌వేర్ టీచింగ్ పార్ట్ టైమ్ జాబ్ ద్వారా ప్రారంభమైంది. అప్పట్లో ఖరీదైన సాఫ్ట్‌వేర్లకు సరసమైన, స్నేహపూర్వక డిజైన్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించాలనే ఆలోచన నుంచి కాన్యా ఆవిర్భావం జరిగింది. ప్రస్తుతం ఆమె కంపెనీకి సీఈవో, సహవ్యవస్థాపకురాలుగా ఆస్ట్రేలియాలో టెక్ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు.


Click it and Unblock the Notifications