Success Story: మారుతున్న టెక్నాలజీలో చిన్న పిల్లలు సైతం వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. వేలు లక్షలు కాకుండా ఏకంగా కోట్లు విలువైన కంపెనీలను నడిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
బడికెళ్లే వయస్సులో కోట్లు విలువైన కంపెనీలను నిర్మించటం అంత ఈజీ కాదు. వినటానికి కొంచెం వింతగానే అనిపిస్తున్నప్పటికీ ముంబైలో నివశిస్తున్న గుజరాతీ బుడ్డోడు తిలక్ మెహతా దీనిని చేసి చూపించాడు. చదువుతో పాటు వ్యాపారాన్ని కొనసాగిస్తూ రెండేళ్లుగా విజయవంతమైన వ్యాపారిగా నిలిచాడు. అతని సంస్థ దాదాపు 200 మందికి ఉపాధిని అందిస్తోంది. బుడ్డోడు ఈ వ్యాపారాన్ని తన 13వ ఏట ప్రారంభించాడు.

తిలక్ 2006లో జన్మించిన న్యూ ఏజ్ కిడ్. గుజరాత్‌లో జన్మించిన తిలక్ ప్రస్తుత వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. మెహతా తండ్రి విశాల్ ఒక లాజిస్టిక్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. ఈ బుడ్డోడికి ఒక సోదరి కూడా ఉంది. తిలక్‌కి తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన నుండి వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది.
ఒకసారి తిలక్ తనకు అవసరమైన కొన్ని స్టేషనరీ వస్తువులను తీసుకురావాలని తండ్రిని ఆఫీసు నుంచి వచ్చాక అడిగాడు. అయితే విపరీతమైన అలసటతో ఉన్న తండ్రి తిరస్కరించటంతో దీనికి పరిష్కారం గురించి ఆలోచిస్తూ.. పుస్తకాలను ఇంటి డెలివరీ చేసే సర్వీస్ గురించి ఆలోచనతో వచ్చాడు. ఈ ఆలోచన గురించి తండ్రికి వివరించాడు. అలా తిలక్ తన కొరియర్ సర్వీస్ ప్రారంభించేందుకు అవసరమైన పూర్తి ప్రణాళిక సిద్ధమైంది. దీనికి అవసరమైన పెట్టుబడిని తండ్రి అందించాడు.
అలాగే వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన బ్యాంకు అధికారి ఘనశ్యామ్ పరేఖ్‌కు పరిచయం చేశాడు. తిలక్ ఆలోచన విని బ్యాంకు ఉద్యోగం వదిలేసి వ్యాపారంలో చేరాడు. వీరంతా కలిసి పేపర్ ఎన్ పార్సెల్ పేరుతో కొరియర్ సర్వీస్‌ను ప్రారంభించారు. పేపర్స్ ఎన్ పార్సెల్ అనేది షిప్పింగ్, లాజిస్టిక్స్ సేవలను అందించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్. ఇందుకోసం కంపెనీ పెద్ద టీమ్‌ను సిద్ధం చేసింది. ఈ సంస్థ తన మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు ఇంటింటికీ సేవను అందిస్తుంది. ప్రస్తుతం సంస్థ ప్రతిరోజూ వేలాది పార్శిళ్లను రూ.40 నుంచి రూ.180 ఛార్జీతో డెలివరీ చేస్తోంది.


Click it and Unblock the Notifications