Success Story: ఏ పని చేసేవాడికైనా సక్సెస్ ఒక్క రాత్రిలోనో లేదా ఒక్క రోజులోనే రాదు. దాని వెనుక కనిపించని అనేక రోజులు, నెలలు, సంవత్సరాల కష్టం ఉంటుంది. అలా జీవితంలో కొంత భాగాన్ని కలల నిర్మాణానికి ఖర్చుచేసి కంపెనీని సృష్టించిన వ్యక్తి గురించి ఇప్పుడు తెలుకుందాం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీని ఆకట్టుకున్న స్టార్టప్ డన్జో సహ వ్యవస్థాపకుడు కబీర్ బిస్వాస్ గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. ప్రస్తుతం డన్జో సీఈవోగా ఉన్న కబీర్ ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. నిమిషాల్లో సరుకులను అందించే వ్యాపారంలో పోటీని తట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే కస్టమర్ల అభిరుచుల గురించి తెలుసుకోవటం కోసం వారిని అర్థం చేసుకునేందుకు ఎయిర్ టెల్ కంపెనీలో కస్టమర్ సర్వీస్ విభాగంలో పనిచేశారు.

కబీర్ బిస్వాస్ తన వ్యాపార ప్రయాణాన్ని 2014లో ప్రారంభించారు. అప్పట్లో హోపర్ అనే చిన్న కంపెనీని ప్రారంభించగా దానిని తర్వాతి కాలంలో మెసేజింగ్ యాప్ Hike కొనుగోలు చేసింది. దీని నుంచి వచ్చిన ఆదాయంతో తర్వాత మిత్రులతో కలిసి డన్జోను ప్రారంభించారు. మెుదట్లో వీరు ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆర్డర్లను స్వీకరిస్తూ వాటిని డెలివరీ చేసేవారు. అప్పట్లో సభ్యులు తమకు అవసరమైన వస్తువుల లిస్టు ఇందులో పోస్ట్ చేసేవారు. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.6,400 కోట్లకు చేరుకుంది.
కంపెనీని ప్రారంభించిన కొద్ది కాలానికే వ్యాపారవేత్త ముఖేష్ అంబానీని ఇది ఆకర్షించింది. దీంతో రిలయన్స్ రిటైల్ దీనిలో పెట్టుబడులను పెట్టి 24 శాతం వాటాను దక్కించుకుంది. అయితే ప్రస్తుతం కంపెనీ డబ్బు కొరతతో ఇబ్బందులు పడుతోంది. చాలా కాలంగా ఉద్యోగులకు జీతాలు, సప్లయర్లకు పేమెంట్స్ చేయటంలో కష్టపడుతోంది. దీంతో కొన్ని నెలలుగా ఉద్యోగుల సంఖ్యను సైతం తగ్గించింది. తాజాగా నేడు తన ఉద్యోగులకు పంపిన మెయిల్ ప్రకారం ఫండ్స్ తెచ్చుకోవటంలో ఇబ్బందుల కారణంగా బ్యాచ్‌ల ప్రకారం ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామంటూ మరికొన్ని రోజులు చెల్లింపులను వాయిదా వేసింది. ఇది కంపెనీ మనుగడపై అతిపెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications