Budget Stocks: నేడే చివరి అవకాశం- నిపుణులు సూచిస్తున్న 5 బడ్జెట్ స్టాక్స్, టార్గెట్ ధరలివే
Budget 2024: కేంద్ర బడ్జెట్ రేపు ప్రవేశపెట్టనున్న వేళ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసేందుకు రైల్వేలు, ఇన్‌ఫ్రా, ఎనర్జీ, ఆయిల్ అండ్ పవర్, ఆటో, బ్యాంకింగ్ రంగాలు పెట్టుబడులకు పరిశీలించదగినవిగా నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి యూఎస్-చైనా మధ్య వాణిజ్య యుద్ధంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారత స్టాక్ మార్కెట్ ఇటీవల క్షీణించినప్పటికీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతాయని భావిస్తున్నారు.
నిపుణులు సూచిస్తున్న బడ్జెట్ బెట్టింగ్ స్టాక్స్:
ఈ క్రమంలో యూనియన్ బడ్జెట్ 2024కి ముందు కొనుగోలు చేయాల్సిన స్టాక్‌లపై ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షకర్ కొన్ని సూచనలు చేశారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఆటో సెగ్మెంట్‌లో, మహీంద్రా & మహీంద్రా, టాటా మోటార్స్‌లను కొనుగోలు చేయడం పరిగణించవచ్చని అన్నారు. ఇదే క్రమంలో బ్యాంకింగ్ రంగం నుంచి ఎస్బీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్ షేర్లను పరిగణించాన్నారు. అలాగే ఒబెరాయ్ రియాల్టీ, RITES, KPIT టెక్, HBL పవర్‌లను కొనుగోలు చేయాలని SS వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు సుగంధ సలహా ఇస్తున్నాయి.

టాప్-5 పిక్స్ టార్గెట్స్ ఇవే:
SBI కార్డ్స్: దాదాపు రూ.7680 నుంచి రూ.685 కొనండి. టార్గెట్‌ను రూ. 840 వద్ద ఉంచండి. స్టాప్ లాస్‌ను రూ.595 వద్ద ఉంచడం మర్చిపోవద్దు.
ఒబెరాయ్ రియాల్టీ: రూ.2050 టార్గెట్‌తో రూ.1570 నుంచి 1580 మధ్య కొనుగోలు చేయండి. రూ.1280 స్టాప్ లాస్ ఉంచండి.
RITES: రూ.650 నుంచి రూ.660 వద్ద కొనుగోలు చేయండి. రూ.880 వద్ద టార్గెట్, రూ.520 వద్ద స్టాప్ లాస్‌గా పరిగణించాలి.
KPIT టెక్: ఈ స్టాక్‌ను రూ.1690 నుంచి రూ.1695 వద్ద కొనుగోలు చేయండి. ఇన్వెస్టర్లు టార్గెట్ ధరను రూ .2080 వద్ద ఉంచవచ్చు. స్టాప్ లాస్ ధరను రూ.1500 వద్ద సెట్ చేయడం మర్చిపోవద్దు.
HBL పవర్: రూ.540-550 వద్ద కొనుగోలు చేయండి. రూ.765 టార్గెట్, స్టాప్ లాస్ రూ.460 వద్ద కొనసాగించాలి.
NOTE: పైన అందించిన వివరాలు బ్రోకరేజ్ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. దీని ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటానికి ముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి.


Click it and Unblock the Notifications