Muhurat Trading: వాస్తవానికి దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు సెలవులో ఉన్నాయి. అయితే నేడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలు క్లోజ్ అయి ఉంటాయి. ఈ క్రమంలో అన్ని ట్రేడింగ్ నిలిచిపోనుంది. అయితే నేడు ముహురత్ ట్రేడింగ్ పేరుతో ప్రత్యేకంగా సాయంత్రం 6 నుంచి 7 వరకు ట్రేడింగ్ నిర్వహించబడుతుంది. దీని తర్వాత నవంబర్ 15న గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్లు ఈనెలలో మరోసారి సెలవులో ఉండనున్నాయి. హిందువుల ఆచారం ప్రకారం ఈ రోజున కొత్త పెట్టుబడులను ప్రారంభించటాన్ని చాలా మంది శుభపరిణామంగా పరిగణిస్తుంటారు. అందుకే చాలా మంది వచ్చే దీపావళి కోసం ఈ సంవత్ 2081 సమయంలో కొన్ని షేర్లను కొనుగోలు చేస్తుంటారు.
సంవత్ 2081 మార్కెట్ ఔట్లుక్..
వాస్తవానికి సంవత్ 2080 పెట్టుబడిదారులకు మంచి రాబడులను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో మార్కెట్లలో కొనసాగిన బుల్ జోరుతో చాలా మంచి రాబడులను ఇన్వెస్టర్లు అందుకున్నారు. ఈ క్రమంలో సంవత్ 2081పై మార్కెట్ సెంటిమెంట్ ఈసారి మిశ్రమంగా ఉంది. మార్కెట్లలో అధిక వాల్యుయేషన్స్, నిరాశాజనకమైన క్యూ2 ఫలితాల కారణంగా అక్టోబరులో నిఫ్టీ సూచీ 5.7 శాతం క్షీణతను చూసింది. ఈక్రమంలో ప్రస్తుత సంవత్ 2081లో బాటమ్స్-అప్ స్టాక్ పికర్స్ మార్కెట్ అవుతుందని ఎస్బీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. సెంట్రమ్ బ్రోకరేజ్ తో పాటు మరిన్ని సంస్థలు సూచించిన షేర్ల జాబితాను పరిశీలిస్తే..

ముహురత్ ట్రేడింగ్ కోసం బ్రోకరేజీలు సూచించిన స్టాక్స్..
సెంట్రమ్ బ్రోకింగ్ సిఫార్సు చేసిన స్టాక్స్..
1. మాక్రోటెక్ డెవలపర్లు: రూ.1,082 వద్ద కొనండి | లక్ష్యం: రూ.1,368
2. టీసీఎస్: రూ.4,085-3,900 వద్ద కొనండి | లక్ష్యం: రూ.4,650 | స్టాప్ లాస్: రూ. 3,700
3. ట్రెంట్: రూ.7,150-6,950 వద్ద కొనండి | టార్గెట్: రూ.8,900 | స్టాప్ లాస్: రూ. 6,300
4. జ్యోతి రెసిన్లు మరియు అడ్హెసివ్: రూ.1,457 వద్ద కొనండి | టార్గెట్: రూ.1,930
రెలిగేర్ బ్రోకింగ్ సిఫార్సు చేసిన స్టాక్స్..
1. PTC ఇండియా: రూ.180-182 వద్ద కొనండి | లక్ష్యం: రూ.237-241 | స్టాప్ లాస్: రూ.165-170
2. BHEL: రూ.232-235 వద్ద కొనండి | లక్ష్యం: రూ.295-300 | స్టాప్ లాస్: రూ.212
3. NHPC: రూ.82 వద్ద కొనండి | లక్ష్యం: రూ.108-110 | స్టాప్ లాస్: రూ.75
HDFC సెక్యూరిటీస్ సిఫార్సు చేసిన స్టాక్స్..
1. యాక్సిస్ బ్యాంక్: రూ.1,189-1,210 వద్ద కొనండి | లక్ష్యం: రూ.1,332-1,403 | స్టాప్ లాస్: రూ.1,070
2. కరూర్ వైశ్యా బ్యాంక్: రూ.214-218 వద్ద కొనండి | లక్ష్యం: రూ.249-269 | స్టాప్ లాస్: రూ.183
3. స్టైలమ్ ఇండస్ట్రీస్: రూ.2,195-2,230 వద్ద కొనండి | లక్ష్యం: రూ.2,560-2,690 | స్టాప్ లాస్: రూ.1,880
ఈరోజు జరిగే స్పెషల్ ట్రేడింగ్ సమయంలో దీర్ఘకాలిక పెట్టుబడుల వ్యూహంతో ఉండే ఇన్వెస్టర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లను కొనుగోలు చేయాలని సూచించబడింది. బ్యాంకింగ్ రంగంలో ఇతర సంస్థల కంటే మంచి రాబడులను కంపెనీ తెచ్చిపెట్టగలదని నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల కంపెనీ విడుదల చేసిన రెండవ త్రైమాసిక ఫలితాల్లో మార్కెట్ అంచనాలను అధిగమించిన పనితీరును కనబరిచిందని అందుకే ముహురత్ ట్రేడింగ్ సమయంలో కొనుగోలుకు ఉత్తమంగా పరిగణించబడుతోందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications