Investment: ఆర్బీఐ నిర్ణయంతో మంచి లాభాలిచ్చే స్టాక్స్.. మీ దగ్గర ఉన్నాయా..?
Investment: మే 2022 నుంచి ఇప్పటి వరకు రిజర్వు బ్యాంక్ తన ద్రవ్య పరపతి విధానంలో రెపో రేటును పెంచుతూనే వచ్చింది. ఈ క్రమంలో వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ విధానాన్ని ఇప్పటి వరకు ఆర్బీఐ అవలంబిస్తూ వచ్చింది. అయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో జరిగిన తొలి సమావేశంలో మాత్రం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
వడ్డీ రేట్లను మరింతగా పెంచితే ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ సరఫరా ఇబ్బందులు ఏర్పడతాయని.. అవి పరోక్షంగా డిమాండ్, ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారితీస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన వేళ శక్తికాంతదాస్ సైతం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు స్వల్పంగా రేట్ల పెంపు చివరగా జరగవచ్చని భావించారు.

వడ్డీ రేట్ల పెంపుపై రిజర్వు బ్యాంక్ తాజాగా తీసుకున్న బ్రేక్ కొన్ని కంపెనీలకు మాత్రం భారీగా కలిసొచ్చే అంశంగా ఉంది. ద్రవ్యోల్బణం క్రమంగా చల్లబడుతుందని సెంట్రల్ బ్యాంక్ గట్టి సంకేతాలను ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇది కొన్ని రంగాలకు సానుకూలంగా మారనుంది.
ఆర్బీఐ రేట్లను పెంచుకూడదని తీసుకున్న నిర్ణయం.. ప్రధానంగా పెద్ద డెట్ కంపెనీలు, గ్రోత్ స్టాక్స్, స్మాల్ అండ్ మిడ్-క్యాప్ స్పేస్ కంపెనీలు- మధ్యస్థ కాలంలో కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలకు కొంత ఉపశమనం లభించనుంది. ఈ కారణంగా మార్కెట్లోని కొన్ని కంపెనీల షేర్లు స్వల్ప కాలంలో తమ ఇన్వెస్టర్లకు దాదాపు 15 శాతం లాభాన్ని అందించనున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ముతూట్ ఫైనాన్స్, పీఎఫ్సీ, ఆదిత్య బిర్లా క్యాపిటల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలను అందిస్తాయని బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. వీటికి మంచి టార్గెట్ ధరలను కూడా అందించాయి.


Click it and Unblock the Notifications