Paisa Double: కొత్త ఏడాది ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడి మెుదలైన విషయం మనందరికీ తెలిసిందే. కానీ కొన్ని స్టాక్ మాత్రం పండుగ నాటికి ఇన్వెస్టర్ల డబ్బును డబుల్ చేశాయి. దీనినే రిప్ ఆఫ్ రిటర్న్స్ అని పిలుస్తారు.దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కంపెనీల లాభాలు..
2023 మొదటి 15 రోజుల్లో కొన్ని కంపెనీల షేర్లు తమ పెట్టుబడిదారులకు రెట్టింపు కంటే ఎక్కువ రాబడిని అందించాయి. వీటిలో నెట్‌వర్క్ పీపుల్ సర్వీస్ టెక్నాలజీ 165.12 శాతం, 3పీ ల్యాండ్ హోల్డింగ్స్ 116.99 శాతం, కూల్ క్యాప్స్ ఇండస్ట్రీస్ 104 శాతం బంపర్ రాబడిని తమ ఇన్వెస్టర్లకు అందించాయి.

కనిష్ఠాల నుంచి జంప్..
మెుదటగా కూల్ క్యాప్స్ ఇండస్ట్రీస్ షేర్ గురించి తెలుసుకుందాం. శుక్రవారం ఈ కంపెనీ షేర్ 6.38 శాతం పెరిగి రూ.501.05 వద్ద ముగిసింది. దీనికి ముందు వారంలో షేర్ ధర రూ.375.35గా ఉంది. అంటే ఈ కాలంలో స్టాక్ 33.49 శాతం రాబడిని అందించి మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. అలాగే ఒక నెల కాలాన్ని గమనిస్తే స్టాక్ 108.95 శాతం వృద్ధిని, 3 నెలల్లో ఈ స్టాక్ 188 శాతం కంటే ఎక్కువ జంప్ చేసింది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.41.50 వద్ద ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.478.80గా ఉంది.

నిండుగా డబ్బులు..
3P ల్యాండ్ హోల్డింగ్స్ కూడా కొత్త సంవత్సరంలో తన పెట్టుబడిదారులను ధనవంతులను చేయడంలో ముందుంది. ఈ స్టాక్ ఒక వారంలో 32 శాతం రాబడిని, ఒక నెలలో 91 శాతం రాబడిని అందించింది. అయితే గత 15 రోజుల్లో ఈ స్టాక్ దాదాపుగా 117 శాతం పెరిగింది. దీని 52 వారాల గరిష్ఠ ధర రూ.36.65 వద్ద ఉండగా.. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.13గా ఉంది.

పైసా డబుల్..
ఇన్వెస్టర్ల సంపదను అమాంతం పెంచిన స్టాక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అవును నెట్‌వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీ స్టాక్ ఒక్క నెల కాలంలో దాదాపు 170 శాతం మేర పెరిగింది. మూడు నెలల కాలంలో స్టాక్ 173 శాతం.. ఏడాదిని గమనిస్తే ఏకంగా 378.68 శాతం మేర పెరిగింది. అయితే ఈ ఏడాది కేవలం 15 రోజుల్లోనే ఈ స్టాక్ 165 శాతానికి పైగా రాబడిని అందించింది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ కేవలం 15 రోజుల కిందట ఈ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వారి డబ్బు దాదాపు రూ.2.65 లక్షల కంటే ఎక్కువ అయి ఉండేది.
NOTE: పైన్ అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ చేయకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి.. నిపుణుల సలహాలు తీసుకోవటం ఉత్తమం.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications