Diwali Stocks: ఈ 6 షేర్లు కొంటే లాభాల అదృష్టమే.. బ్రోకరేజ్ దీపావళికి పిక్ చేసిన స్టాక్స్ ఇవే..!
Muhurat Trading: ముహురత్ ట్రేడింగ్ కోసం చాలా మంది భారతీయ పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. గడచిన ఏడాది దీపావళి తర్వాతి నుంచి ఈక్విటీ మార్కెట్లలో మెగా బుల్ ర్యాలీ కొనసాగుతోంది. దీనికి బలమైన కార్పొరేట్ ఆదాయాల్లో వృద్ధి, బలమైన జీఎస్టీ కలెక్షన్స్, కాపెక్స్ సైకిల్ పునరుద్ధరణ, అనుకూలమైన రుతుపవనాలు, బలంగా కొనసాగుతున్న దేశీయ డిమాండ్ వంటి కీలకమైన అంశాలు ఈ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచిన సంగతి తెలిసిందే.
గత దీపావళి తర్వాత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్-నిఫ్టీలు 25 శాతం పెరగగా, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు దాదాపు 40 శాతం రాబడిని అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది ఈ దీపావళికి జరగనున్న ముహురత్ ట్రేడింగ్ సమయంలో సాంవత్ 2081 కోసం సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు మనం బ్రోకరేజ్ అసిత్ సి మెహతా కొనుగోలుకు సూచించిన 6 షేర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా 1951లో స్థాపించబడిన Ador Welding కంపెనీ షేర్లపై బ్రోకరేజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీపావళికి కొనుగోలు చేయాలని సూచిస్తూ కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.1806గా నిర్ణయించింది. కంపెనీ దేశంలో ప్రముఖ వెల్డింగ్ కంపెనీల్లో ఒకటిగా ఉంది. అధిక-నాణ్యత వెల్డింగ్ పరికరాలు, వినియోగ వస్తువులు, వెల్డింగ్ ఆటోమేషన్ సొల్యూషన్‌లను తయారు చేస్తుంది. దేశవిదేశాల్లో సాధారణ మౌలిక సదుపాయాలు, రైల్వేలు, నౌకానిర్మాణం వంటి రంగాల్లో కంపెనీ బలమైన డిమాండ్ వల్ల అభివృద్ధి చెందుతోంది. ఇక బ్రోకరేజ్ రాడార్ లో ఉన్న రెండవ స్టాక్ Alicon Castalloy. దీపావళికి కొనుగోలు చేయాలంటూ టార్గెట్ ధరను షేరుకు రూ.1765గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ హై క్వాలిటీ కాస్ట్ అల్యూమినియం ఉత్పత్తి, సరఫరాదారుగా ఉంది. కంపెనీ అద్భుతమైన గ్రోత్ చూస్తోంది.
బ్రోకరేజ్ కొనుగోలు చేయాలంటూ CIE Automotive టార్గెట్ ధరను రూ.698గా నిర్ణయించింది. కంపెనీ ఆటో కాంపొనెంట్స్ ఉత్పత్తిలో అతిపెద్ద ఆటగాడిగా ఉంది. కంపెనీ ప్రస్తుతం మంచి ఆర్డర్ బుక్ కలిగి ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న వేళ కొత్త ఉత్పత్తుల పోర్ట్ ఫోలియోను నిర్మిస్తోంది. ఇదే క్రమంలో ముహురత్ ట్రేడింగ్ సమయంలో Astral Limited షేర్లకు రూ.2627 ధరను టార్గెట్ ధరగా నిర్ణయించింది. దేశంలోని నిర్మాణ రంగం వేగంగా కొనసాగుతున్న వేళ పైప్స్ అండ్ శానిటరీ ఉత్పత్తులకు డిమాండ్ పెరగటంతో బ్రోకరేజ్ ఈ కంపెనీ షేర్లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కూడా ఉత్పత్తులకు డిమాండ్ పెంచుతుందని అంచనా వేయబడింది.
ఇదే క్రమంలో బ్రోకరేజ్ ఎంచుకున్న కంపెనీ షేర్లలో ITD Cementation India కూడా స్థానాన్ని దక్కించుకుంది. దీంతో స్టాక్ టార్గెట్ ధరను రూ.758గా నిర్ణయించింది. కంపెనీకి ఎలివేటెడ్ కారిడార్లు, భూగర్భ మెట్రో స్టేషన్లు, భవనాలు సొరంగాలు, పారిశ్రామిక నిర్మాణాలు, విమానాశ్రయ టెర్మినల్ భవనాలు, సాంకేతిక భవనాలు, డ్యామ్‌లతో కూడిన జలవిద్యుత్ కేంద్రాలతో సహా ఆఫ్‌షోర్ సముద్ర నిర్మాణాలు, ఓడరేవులు, సామూహిక వేగవంతమైన రవాణా వ్యవస్థల నిర్మాణంలో ప్రముఖ సంస్థగా పేరుంది. ఇక చివరిగా బ్రోకరేజ్ ఎంచుకున్న పెట్టుబడి స్టాక్స్ జాబితాలో J Kumar Infraprojects కంపెనీ స్థానం దక్కించుకుంది. దీనికి రూ.950 టార్గెట్ ధరగా అంచనా వేస్తూ దీపావళి స్పెషల్ ట్రేడింగ్ సమయంలో పైన పేర్కొన్న షేర్లను కొనుగోలు చేయాలని సూచించింది.


Click it and Unblock the Notifications