Rahul Portfolio: దేశంలో ప్రస్తుతం ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా రాహుల్ గాంధీ కేరళ వాయనాడ్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆయన పెట్టుబడుల పోర్ట్ ఫోలియో గురించి ఇన్వెస్టర్లు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.
అఫిడవిట్ ప్రకారం.. రాహుల్ గాంధీ స్టాక్ మార్కెట్లో రూ.4.3 కోట్ల పెట్టుబడులు, రూ.3.81 కోట్లు మ్యూచువల్ ఫండ్ డిపాజిట్లు, రెండు బ్యాంకు ఖాతాల్లో రూ.26.25 లక్షల పొదుపు కలిగి ఉన్నారు. రాహుల్ గాంధీ టాటాతో సహా అనేక పెద్ద కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు. వివిధ కంపెనీల్లో షేర్ హోల్డింగ్స్ పరిశీలిస్తే..

- పిడిలైట్ ఇండస్ట్రీస్: రాహుల్ గాంధీ కంపెనీకి చెందిన 1474 షేర్లను కలిగి ఉన్నారు. దీని విలువ రూ.42.27 లక్షలు.
- బజాజ్ ఫైనాన్స్: రాహుల్ గాంధీకి కంపెనీలో 551 షేర్లు ఉన్నాయి. దీని ధర రూ.35.89 లక్షలు.
- నెస్లే ఇండియా: రాహుల్ గాంధీకి కంపెనీలో 1370 షేర్లు ఉన్నాయి. దీని ధర రూ.35.67 లక్షలు.
- ఏషియన్ పెయింట్స్: రాహుల్ గాంధీ వద్ద రూ.35.29 లక్షల విలువైన 1231 కంపెనీ షేర్లు ఉన్నాయి.
- టైటాన్ కంపెనీ: రాహుల్ గాంధీ ఈ టాటా కంపెనీలో 897 షేర్లను కలిగి ఉన్నారు. దీని విలువ రూ.32.59 లక్షలు.
- హిందుస్థాన్ యూనిలీవర్: కంపెనీలో రాహుల్ గాంధీకి 1161 షేర్లు ఉన్నాయి. వీటి విలువ రూ.27.02 లక్షలు.
- ICICI బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకులో రాహుల్ గాంధీకి 2299 షేర్లు ఉన్నాయి. దీని ధర రూ.24.83 లక్షలు.
- దివీస్ లాబొరేటరీ: రాహుల్ గాంధీ ఈ కంపెనీలో రూ.19.7 లక్షల విలువైన 567 షేర్లను కలిగి ఉన్నారు.
-సుప్రజిత్ ఇంజనీరింగ్: రాహుల్ గాంధీ ఈ కంపెనీలో రూ.16.65 లక్షల విలువైన 4068 షేర్లను కలిగి ఉన్నారు.
- గార్వేర్ టెక్నో ఫైబర్స్: రాహుల్ గాంధీ ఈ కంపెనీలో 508 షేర్లను కొనుగోలు చేశారు. దీని ధర రూ.16.43 లక్షలు.
ఇదే క్రమంలో రాహుల్ గాంధీ సావరిన్ గోల్డ్ బాండ్లలో కూడా పెట్టుబడులను కలిగి ఉన్నారు. రూ.15.21 లక్షల మార్కెట్ విలువతో సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి. అఫిడవిట్ ప్రకారం మెుత్తం రాహుల్ ఆస్తుల విలువ రూ.20.4 కోట్లుగా ఉంది. వీటిలో స్థిరాస్తుల విలువ రూ.11.5 కోట్లు కాగా మిగిలిన రూ.9.24 కోట్లు చరాస్తులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications