Stock Ideas: దేశీయ స్టాక్ మార్కెట్లు అక్టోబర్ మాసంలో అత్యంత దారుణంగా క్షీణించాయి. ప్రధానంగా విదేశీ మదుపరులు మార్కెట్లను వీడటం దీనికి ఒక కారణంగా ఉంది. దీని కన్నా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మార్కెట్లకు పెద్ద నష్టాన్ని కలిగించింది. ఈ క్రమంలో బ్రోకరేస్ సంస్థలు 4 షేర్లను కొనుగోలుకు సూచిస్తున్నాయి.
ICICI బ్యాంక్.. :దేశంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో రెండో స్థానంలో కొనసాగున్న ఐసీఐసీఐ బ్యాంక్ క్యూ2లో అద్భుతమైన ఫలితాలు నివేదించింది. ఈ క్రమంలో నికర లాభం ఏకంగా 35 శాతం వృద్ధితో రూ.10,261 కోట్లకు చేరుకుంది. దీంతో బ్రోకరేజ్ సంస్థ నువామా ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లకు 'BUY' రేటింగ్ ఇచ్చింది. నువామా స్టాక్‌కు ఏడాది టార్గెట్ ధర రూ.1,195గా ఇచ్చింది. ఒక్కో షేరుకు 914.05 ధర కంటే 30 శాతం అడ్వాన్స్‌ను చూపుతోంది.

JSW ఎనర్జీ.. :JSW ఎనర్జీ పవర్ జనరేషన్, ట్రాన్స్‌మిషన్ అండ్ ట్రేడింగ్ కంపెనీ. దీని షేర్లపై Antvic Stockbroking 'కొనుగోలు' రేటింగ్‌ను అందించింది. ప్రస్తుతం మార్కెట్లో దాదాపు రూ.376 వద్ద ఒక్కో షేరుకు రూ.488 టార్గెట్ ధరగా బ్రోకరేజ్ అందించింది. ఏడాది కాలంలో పెట్టుబడిదారులు 29 శాతం రాబడిని అందుకోవచ్చని తెలుస్తోంది.
ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్.. :ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బీమా రంగంలో వ్యాపారం చేస్తోంది. ఇదొక జాయింట్ వెంచర్ కంపెనీ. కంపెనీ ప్రమోటర్లుగా ఇండియాకు చెందిన ఐసీఐసీఐ బ్యాంక్, యూకేకు చెందిన ప్రుడెన్షియల్ Plc ఉన్నాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ ఈ కంపెనీ షేర్లకు కొనుగోలు రేటింగ్ అందించింది. ప్రస్తుతం దాదాపు 510 దగ్గరగా ఉన్న కంపెనీ షేర్ ధర ఏడాదిలో 29 శాతం వరకు పెరిగి రూ.650 స్థాయిలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు బ్రోకరేజ్ వెల్లడించింది.

ITC..:ఇక చివరగా బ్రోకరేజ్ సంస్థలు సానుకూలత తెలిపిన కంపెనీ ఐటీసీ. FMCG ఉత్పత్తుల తయారీ సంస్థ ఐటీసీ పై యాక్సిస్ సెక్యూరిటీస్ తన కొనుగోలు రేటింగ్ అందించింది. సిగరెట్ రంగం నుంచి స్థిరమైన వృద్ధి, ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలో పురోగతి, పేపర్‌బోర్డ్‌లు, అగ్రి విభాగాల స్థిరమైన పనితీరు కొనసాగడం స్టాక్‌కు అనుకూలమైన అంశాలుగా ఉన్నట్లు బ్రోకరేజ్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications