Year Ender 2023: పాత వ్యాపారాన్ని విడిచి కొత్తది పెట్టిన 7 స్టార్టప్ వ్యవస్థాపకులు వీరే..
Year Ender 2023: ఈ ఏడాది స్టార్టప్ కంపెనీలకు భారీగా ఒడిదొడుకులను కలిగించింది. స్టార్టప్‌లకు వచ్చే నిధులలో భారీ క్షీణత కారణంగా చాలా స్టార్టప్ కంపెనీలు మూతపడ్డాయి. దీంతో అనేక మంది ఒక స్టార్టప్‌ను వదిలి మరో స్టార్టప్‌ను ప్రారంభించిన చాలా మంది వ్యవస్థాపకులు ఉన్నారు.
ఈ క్రమంలో ముందుగా డైన్‌అవుట్ సహ వ్యవస్థాపకుడు వివేక్ కపూర్ స్విగ్గీని విడిచిపెట్టి.. దిల్లీకి చెందిన హెల్త్‌కేర్ ఫైనాన్సింగ్ స్టార్టప్ ఆయుష్‌పేతో చేతులు కలిపాడు. అతను ఆయుష్‌పే సహ వ్యవస్థాపకుడు, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అయ్యాడు. కంపెనీలో ఏంజెల్ ఇన్వెస్టర్‌గా కూడా ఉన్నారు. గత సంవత్సరం డైన్‌అవుట్‌ను కొనుగోలు చేసినప్పుడు వివేక్ కపూర్ స్విగ్గీ నాయకత్వ బృందంలో భాగమయ్యారు.

ఎడ్‌టెక్ స్టార్టప్ టీచ్‌మింట్ సహ వ్యవస్థాపకుడు అన్షుమన్ కుమార్ తన కొత్త వ్యాపారమైన Duolopపై దృష్టి పెట్టడానికి మార్చి నెలలో పాత కంపెనీని వీడాడు. దీని తర్వాత ఆటోమొబైల్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ స్టార్టప్ గోమెకానిక్ సహ వ్యవస్థాపకులు రిషబ్ కర్వా, నితిన్ రాణా ఈ స్టార్టప్ నుంచి వైదొలిగారు. ఈ స్టార్టప్‌లో కొన్ని ఆర్థిక అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దీంతో వ్యవస్థాపకులిద్దరూ రాజీనామా చేసి మరో స్టార్టప్ ప్రారంభించారు. స్టార్టప్‌కి సంబంధించిన సమాచారం ఇంకా పబ్లిక్‌గా వెల్లడించబడలేదు.

భాను ప్రతాప్ సింగ్, ఫరీద్ అహ్సన్ షేర్‌చాట్‌కు రాజీనామా చేసి వారి రెండవ వెంచర్‌ను ప్రారంభించారు. ఈ కొత్త వెంచర్ పేరు జనరల్ అటానమీ. దీనిని ఈ ఏడాది మే నెలలో ప్రారంభించారు. నవంబర్ నెలలో కంపెనీ సుమారు 3 మిలియన్ డాలర్ల సీడ్ ఫండింగ్‌ను కూడా పొందారు. ఇక చివరిగా పాలిగాన్ సహ వ్యవస్థాపకుడు జయంతి కనాని అక్టోబరులో ఈ బ్లాక్‌చెయిన్ స్కేలింగ్ ప్లాట్‌ఫారమ్‌కు రాజీనామా చేశారు. ఇప్పుడు అతను మొజాక్, మార్ఫిక్ అనే రెండు కొత్త స్టార్టప్‌లను ప్రారంభించారు.


Click it and Unblock the Notifications