Isha Ambani: ముఖేష్ అంబానీ కూతురు ఇషాకు నెల జీతం ఎంతో తెలుసా? చూస్తే ఫూజులౌట్..
Isha Ambani Salary: దేశంలోనే కాకుండా ఆసియాతో పాటు ప్రపంచ కుబేరుల జాబితాలో అనేక దశాబ్ధాలుగా తన స్థానాన్ని సుస్థిరపరచుకుంటూ వస్తున్నారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఈ ఏడాది చిన్న కుమారుడు అనంత్ వివాహంతో ప్రపంచ మీడియాను ఆకర్షించి వార్తల్లో నిలిచారు. అయితే ఇప్పుడు రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని వేగంగా ముందుకు తీసుకెళుతున్న ఇషా అంబానీపైనే అందరి చూపు కొనసాగుతోంది.
అంబానీ తన కుటుంబంలో అందరినీ వ్యాపారంలో భాగస్వాములుగా మార్చి వారికి సముచిత స్థానాన్ని అందించారు. ఈ క్రమంలోనే పెళ్లైనప్పటికీ కుమార్తె ఇషాకు అంబానీ ఏరికోరి రిటైల్ కేటగిరీని అప్పగించగా.. ఆమె తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకున్నారు. అయితే కూతురికి అంబానీ నెలకు ఎంత జీతంగా చెల్లిస్తున్నారు అనే ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం 33వ ఏటలో ఉన్న ఇషా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీకి సారధ్యం వహిస్తున్నారు. కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ స్థాయిలో చాలా సంవత్సరాలుగా కంపెనీ పురోగతి కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

వాస్తవానికి రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ 2006లో స్థాపించబడిన సంగతి తెలిసిందే. దానిని తన నైపుణ్యంతో ఇషా అంచెలంచెలుగా కొత్త శిఖరాలకు చేర్చి విజయపథంలో నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇషా అంబానీ నెలవారి వేతనం దాదాపు రూ.35 లక్షలుగా ఉంది. అంటే ఏడాదికి రూ.4.2 కోట్ల ప్యాకేజీని సంస్థ నుంచి అందుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువమంది పొరపాటు పడేది ఆమె కెరీర్ రిలయన్స్ లో ప్రారంభమైందనే. కానీ అలా జరగలేదు. మెుదట ఆమె కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే & కంపెనీలో బిజినెస్ అనలిస్ట్ స్థానంలో సేవలు అందించారు. అమెరికాకు చెందిన యేల్ యూనివర్సిటీ నుంచి 2014లో పట్టా అందుకున్న తర్వాత ఆమె చేసిన మెుదటి ఉద్యోగం ఇదే. ఇక్క పనిచేసిన అనుభవం ప్రస్తుతం ఇషాకు రిలయన్స్ ను ముందుకు తీసుకెళ్లటంలో దోహదపడుతోందని నిపుణులు చెబుతున్నారు.
ఇషా గడచిన రెండేళ్ల కాలంలో అనేక అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్లను ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది రిలయన్స్ రిటైల్ వ్యాపార బ్రాండ్ విలువను అనేక రెట్లు పెంచటంలో దోహదపడిందని ఒప్పుకోక తప్పని నిజం. దీంతో ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ విలువ ఏకంగా రూ.8 లక్షల కోట్లను మించిపోయింది. ఈ కంపెనీ దేశంలోని అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఉంది. రిలయన్స్ ప్రస్తుతం దేశంలో 18 వేలకు పైగా స్టోర్లను కలిగి ఉంది. పైగా అనేక స్టార్టప్ కంపెనీల కొనుగోలుతో పాటు డిజిటల్ స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించటంపై ఇషా నేతృత్వంలో రిలయన్స్ గ్రూప్ భారీగా దృష్టిని కొనసాగించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications