Ambani's Antilia: యాంటీలియాలో ఎంత మంది పనివారు ఉంటారో తెలిస్తే షాకే.. వామ్మో వారికి అంత జీతాలా?
Antilia News: ముఖేష్ అంబానీ ఈ పేరు పరిచయం లేని వ్యక్తి భారతదేశంలో ఉండడు. అవును రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద ఆయిల్ నుంచి టెలికాం, ఫ్యాషన్ నుంచి కూల్ డ్రింక్స్ వరకు అనేక వ్యాపారాల ద్వారా అంబానీ ప్రతి సామాన్యుడికి నిత్యజీవితంలో అవసరమైన సేవలను అందిస్తూనే ఉన్నారు. అయితే ఆయన విలాసవంతమైన జీవితం గురించి చాలా తక్కువ విషయాలు బయటకు వస్తుంటాయి. అవి మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి అత్యంత విలాసవంతమైన భవనం యాంటీలియా ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఇది దేశంలోని ఖరీదైన నివాస సముదాయంగా కూడా గుర్తింపు పొందింది. అయితే చాలా మంది మదిలో ఉండే ప్రశ్న ఈ భవనంలో ఎంత మంది పనివారు ఉంటారన్నదే. మీడియా కథనాల సమాచారం ప్రకారం ముఖేష్-నీతా అంబానీలు నివసించే ఈ భవనంలో దాదాపు 500 మంది పనివారు ఉంటారని తెలుస్తోంది. వీరు భవనంలోని రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహాయపడతారని తెలుస్తోంది.

ఇండియా టీవీ నివేదించిన దాని ప్రకారం యాంటీలియాలో దాదాపు 500 మంది పనివారు ఉంటారని తెలిసిందే. వీరు నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు వేతనంగా అందుకుంటున్నట్లు తెలిసింది. అయితే అంబానీ నివాసంలో వీరికి మంచి వేతనాలతో పాటు ఇతర సౌకర్యాలు సైతం అందించబడతాయి. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగుల మాదిరిగానే వీరికి మెడికల్ ఇన్సూరెన్స్, ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఉద్యోగి అనుభవం, చేస్తున్న పని వంటి వాటి ఆధారంగా వేతనాలు చెల్లించబడుతున్నాయి. ఈ క్రమంలో సెక్యూరిటీ నుంచి ఇంట్లో పనిచేసే చెఫ్ వరకు వివిధ బాధ్యతలను చూసుకుంటుంటారు.
అంబానీకి వ్యాపార దక్షతతో పాటు ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. ఇటీవల యూపీలోని ప్రయాగ్ రాజ్ వద్ద జరుగుతున్న మహా కుంభమేళాలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ కూడా లక్షల మందికి సేవలను అందించింది. అక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 'తీర్థ యాత్రి సేవ'ను ప్రారంభించింది. ఇది యాత్రికుల పురోగతిని సులభతరం చేయడానికి, వారి శ్రేయస్సును నిర్ధారించడానికి దోహదపడుతోంది. అక్కడ రిలయన్స్ యాత్రికులకు ఆరోగ్యం, ఆహారం, సురక్షిత ప్రయాణం, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి అనేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మహా కుంభ్ సందర్భంగా ప్రజలకు రిలయన్స్ అందిస్తున్న వివిధ కార్యక్రమాలపై అనంత్ అంబానీ స్పందిస్తూ.. తీర్థయాత్రలకు వచ్చేవారికి సేవ చేయటం వల్ల తాము కూడా ధన్యులమని అన్నారు. సహస్రాబ్దిలో ఒకసారి జరిగే కార్యక్రమంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న యాత్రికులకు తమ సేవలు దోహదపడుతున్నాయని అన్నారు.


Click it and Unblock the Notifications