Rules Changed in September: ప్రతినెల మాదిరిగానే సెప్టెంబర్ 1 నుంచి కొన్ని రూల్స్ మారిపోయాయి. అయితే ఇవి వ్యక్తుల ఆర్థిక అంశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే ఆందోళన అందరిలోనూ ఉంది. ఈ క్రమంలో సెప్టెంబరులో మారిపోయిన అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
1. ప్రతి నెల లాగానే దేశంలోని చమురు కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో మార్పు ప్రకటించాయి. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.39 మేర పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఇది దేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారులపై అదనపు భారాన్ని మోపనుంది. దీనికి ముందు ఆగస్టులో కమర్షియల్ సిలిండర్ ధరను రూ.8.50 పెంచిన చమురు సంస్థలు, జూలైలో మాత్రం రూ.30 తగ్గింపును ప్రకటించాయి.

2. ఫేక్ కాల్స్, ఫేక్ మెసేజ్‌లను నియంత్రించేందుకు టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ నిబంధనలను తీసుకొచ్చింది. దేశంలోని టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, బిఎస్‌ఎన్‌ఎల్ ట్రాయ్ జారీచేసిన కఠిన మార్గదర్శకాలను పాచించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆపరేటర్లు సెప్టెంబర్ 30 నాటికి 140 మొబైల్ నంబర్ సిరీస్‌ల నుంచి బ్లాక్‌చెయిన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌కు టెలిమార్కెటింగ్ కాల్స్, వాణిజ్య సందేశాలను మార్చాలని TRAI ఆదేశించింది.
3. సెప్టెంబరులో ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి తన క్రెడిట్ కార్డ్ నియమాల్లో పెద్ద మార్పులను తీసుకొచ్చింది. దీనిప్రకారం బ్యాంక్ యుటిలిటీ లావాదేవీలపై రివార్డ్ పాయింట్ల పరిమితిలో మార్పులు తీసుకొచ్చింది. సెప్టెంబర్ 1, 2024 నుంచి అమలులోకి వచ్చిన రూల్స్ ప్రకారం పైన పేర్కొన్న లావాదేవీలపై వినియోగదారులు ప్రతి నెలా 2,000 పాయింట్ల వరకు మాత్రమే పొందగలరు. థర్డ్ పార్టీ యాప్ ద్వారా ఎడ్యుకేషనల్ పేమెంట్ చేస్తే HDFC బ్యాంక్ ఎలాంటి రివార్డ్ ఇవ్వబోదని గుర్తుంచుకోవాలి.
4. ఇదే క్రమంలో మరో ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ సెప్టెంబర్ 2024 నుంచి క్రెడిట్ కార్డ్‌లపై చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే క్రమంలో చెల్లింపు తేదీని గతంలో ఉన్న 18 నుంచి 15 రోజులకు తగ్గించబడుతుంది. అలాగే UPI, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో చెల్లింపుల కోసం RuPay క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు ఇతర చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ల క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్న వారు రివార్డ్ పాయింట్‌లను పొందుతారని ప్రకటించింది.
5. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం పెంచుతుందని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వార్త ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం డీఏ చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 3 శాతం పెరిగిన తర్వాత వారి డీఏ 53 శాతానికి చేరనుందని తెలుస్తోంది.

6. ఉచిత ఆధార్ అప్‌డేట్ కోసం చివరి తేదీ సెప్టెంబర్ 14గా కేంద్రం నిర్ణయించింది. గడువు తర్వాత ఎవరైనా వ్యక్తి ఆధార్‌కు సంబంధించిన కొన్ని విషయాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు మాత్రమే వెసులుబాటు కల్పించబడింది. ఇదే సమయంలో సెప్టెంబరు 14 తర్వాత ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవడానికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
7. ప్రభుత్వ యాజమాన్యంలోని IDBI బ్యాంక్ 300 రోజులు, 375 రోజులు, 444 రోజుల ప్రత్యేక FD కాలపరిమితిని జూన్ 30 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అలాగే ఇండియన్ బ్యాంక్ 300 రోజుల ప్రత్యేక FD గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ప్రత్యేక FD కోసం గడువు సెప్టెంబర్ 30. ఎస్‌బీఐ అమృత్ కలాష్ స్పెషల్ ఎఫ్‌డి స్కీమ్ గడువును కూడా సెప్టెంబర్ 30కి పొడిగించింది. ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో దేశీయ బ్యాంకులు విఫలమవ్వటాన్ని రిజర్వు బ్యాంక్ ఎత్తి చూపిన తర్వాత ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ సంస్థలు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయని తాజా చర్యలతో చెప్పుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్‌డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications