April 1st News: కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కొన్ని కీలకమైన అంశాల గురించి ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండగా ప్రభావితం చేసే ఆర్థిక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఫాస్టాగ్ రూల్స్: ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ నియమాల్లో పెద్ద మార్పు రాబోతోంది. మీ వాహనం ఫాస్టాగ్‌ని బ్యాంక్ KYCతో అప్‌డేట్ చేయడం తప్పనిసరి. లేదంటే ఏప్రిల్ 1 నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా దీన్ని అప్‌డేట్ చేయటం వాహనదారులకు తప్పనిసరి. మార్చి 31 తర్వాత KYC లేని బ్యాంకులు నిషేధించబడతాయి లేదా బ్లాక్ చేయబడతాయి. ఆ తర్వాత ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నా పేమెంట్ చేయటం కుదరదని తెలుస్తోంది. దీని కారణంగా వినియోగదారు టోల్ ప్లాజాలో రెట్టింపు పన్ను చెల్లించాల్సి రావొచ్చు.

పాన్-ఆధార్ లింకింగ్: గతంలో అనేక పొడిగింపుల తర్వాత మార్చి 31న ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయడానికి గడువు ముగియనుంది. ప్రభుత్వం ఇచ్చిన గడువు తర్వాత ఆధార్‌తో లింక్ చేయని వ్యక్తి పాన్ రద్దు చేయబడుతుంది. బ్యాంకు ఖాతా తెరిచేటప్పుడు లేదా రూ.50,000 కంటే పెద్ద లావాదేవీలు చేస్తున్నప్పుడు వినియోగదారు వివిధ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జరిమానా కూడా చెల్లించాల్సి రావొచ్చు.
SBI క్రెడిట్ కార్డ్: మీకు SBI క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే.. ఏప్రిల్ 1 నుంచి వాటి నియమాలు మారిపోనున్నాయి. ఈ తేదీ తర్వాత ఏదైనా అద్దె చెల్లింపుపై వినియోగదారులు రివార్డ్ పాయింట్లను పొందరు. ఏప్రిల్ 1 నుంచి కొన్ని క్రెడిట్ కార్డ్‌లపై ఈ నియమం వర్తిస్తుంది. ఈ నిబంధన ఏప్రిల్ 15 నుంచి అమలు చేయబడుతుందని కార్డు హోల్డర్లు గమనించాలి.
గ్యాస్ సిలిండర్ ధర మార్పు: ప్రతి నెల మాదిరిగానే దేశంలోని చమురు కంపెనీలు నెల మెుదటి తేదీ ఏప్రిల్ 1న గ్యాస్ విక్రయ ధరలను ప్రకటిస్తాయి. అయితే ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున.. మార్చేస్తారేమోనన్న భయం నెలకొంది. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మిగిలిన పనులన్నీ పూర్తి చేయండి. లేదంటే ఏప్రిల్ 1 తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications