Rules Changing On November 1st: ప్రతినెల మాదిరిగానే నవంబర్ 1, 2023 నుంచి కొన్ని రూల్స్ మారుతున్నాయి. అయితే ఇవి మీ ఆర్థిక ప్రణాళికపై నేరుగా ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ విషయాలను తెలుసుకోకపోతే నష్టపోవాల్సి రావొచ్చు.
గ్యాస్ సిలిండర్ ధరలు..
ప్రతినెల నెల మెుదటి తారీఖున దేశంలోని చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను మారుస్తుంటాయి. అయితే ప్రస్తుతం దేశంలోని 5 రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం వీటి ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని తెలుస్తోంది. అయితే CNG, PNG ధరల్లో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.

ఛార్జీల పెంపు..
నవంబర్ 1 నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో లావాదేవీల ఛార్జీలను పెంచుతున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అక్టోబర్ 20న ప్రకటించింది. ఈ మార్పులు S&P BSE సెన్సెక్స్ ఎంపికలకు వర్తించబడతాయి. పెరుగుతున్న లావాదేవీల ఖర్చులు ట్రేడర్లతో పాటు ముఖ్యంగా రిటైల్ పెట్టుబడిదారులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని తెలుస్తోంది.
ఈ-చలాన్..
రూ.100 కోట్లు లేదా అంత కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపారాలు నవంబర్ 1 నుంచి 30 రోజులలోపు ఈ-చలాన్ పోర్టల్‌లో GST చలాన్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని NIC తెలియజేసింది.
దిగుమతుల గడువు..
అక్టోబర్ 30 వరకు HSN 8741 కేటగిరీ కిందకు వచ్చే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ప్రకటించింది. అయితే గడువు ముగుస్తున్న వేళ నవంబర్ 1 నుంచి మోదీ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన నిబంధనలను మారుస్తుందా..? లేదా..? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై స్పష్టత కోసం వ్యాపారులు ఎదురుచూస్తున్నారు.
ఎల్ఐసీ పాలసీలు..
మీ LIC పాలసీ ల్యాప్స్ అయినట్లయితే దానిని తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నట్లయితే.. అక్టోబర్ 31 వరకు బీమా దిగ్గజం వెసులుబాటు కల్పించింది. లాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించేందుకు ఎల్‌ఐసీ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. లక్ష నుంచి మూడు లక్షల రూపాయల మధ్య ఆలస్య రుసుమును 30 శాతం తగ్గింపును ఎల్ఐసీ అందిస్తోంది. దీనిని పాలసీదారులు తెలివిగా వినియోగించుకోవటం ఉత్తమం.


Click it and Unblock the Notifications