Rules Changing From July 1st: ప్రతి నెల మాదిరిగానో కొత్త నెల ప్రారంభం దగ్గర పడుతున్న వేళ దేశంలోని ప్రజలు తెలుసుకోవాల్సి కొన్ని మార్పులు, రూల్స్ జూలైలోనూ ఉన్నాయి. ఇవి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రజల జేబులపై ఆర్థిక భారాన్ని చూపుతాయి. ఈ క్రమంలో జూలై 1 నుంచి మారుతున్న అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. ముందుగా ప్రతినెల మాదిరిగానే రానున్న నెల మెుదటి తేదీన సైతం దేశంలోని చమురు కంపెనీలు గ్యాస్ ధరల్లో మార్పులు ప్రకటించే అవకాశం ఉంది. ఇదే క్రమంలో సీఎన్జీ, పీఎన్జీ రేట్లను సైతం మార్చవచ్చని తెలుస్తోంది.

2. ఇక అందరినీ కలవరానికి గురిచేస్తున్న అంశం రిజర్వు బ్యాంక్ ఆదేశాలతో క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపుల నిబంధనలు మారాయి. దీంతో జూలై 1 నుంచి కొత్త రూల్స్ ప్రకారం వినియోగదారులు ఫోన్ పే, క్రెడ్, బిల్ డెస్క, ఇన్ఫీబీమ్ వంటి ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తమ కార్డు చెల్లింపులు చేయటం కుదరదు. దీని అటు కంపెనీలకు ఇటు వినియోగదారులకు కొత్త ఇబ్బందులను కలిగించొచ్చని తెలుస్తోంది. జూలై 1, 2024 నుంచి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్(BBPS) ద్వారా అన్ని క్రెడిట్ కార్డ్ చెల్లింపులు ప్రాసెస్ చేయాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులను ఆదేశించటమే దీనికి కారణం.
3. కొత్త నెల ప్రారంభం నుంచి సిమ్ కార్డులకు సంబంధించిన రూల్స్ సైతం మారిపోతున్నాయి. టెలికాం రెగ్యులేటర్ TRAI దేశంలో జరుగుతున్న SIM స్వాపింగ్ మోసాలను అరికట్టడానికి జూలై 1, 2024 నుంచి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నిబంధనలను మార్చాలని నిర్ణయించింది. సిమ్ కార్డ్ దొంగిలించబడినా లేదా పాడైపోయినా లాకింగ్ వ్యవధిని ఏడు రోజులకు పొడిగించింది. ఇంతకు ముందు ఇలాంటి సందర్భాల్లో కొత్త సిమ్ వెంటనే కస్టమర్లు తీసుకునేందుకు వెసులుబాటు ఉండేది.
4. ఇక ప్రజలు గమనించాల్సిన ముఖ్యమైన అంశాల్లో బ్యాంకింగ్ రంగానికి చెందిన వార్త ఒకటి ఉంది. దేశంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు ఆ బ్యాంక్ పెద్ద హెచ్చరికను జారీ చేసింది. దీని ప్రకారం 1 జూలై 2024 నుంచి గడచిన మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని, జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలను క్లోజ్ చేయాలని బ్యాంక్ నిర్ణయించింది. వినియోగంలో లేని ఖాతాలను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.
5. పేటీఎం వినియోగదారులకు సంబంధించి జూలై నెలలో కీలకమైన అంశం ఒకటి ఉంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జూలై 20, 2024న నిల్ బ్యాలెన్స్‌లతో ఇన్‌యాక్టివ్ వాలెట్‌లు మూసివేయబడతాయని వెల్లడించింది. దీనికి సంబంధించి ముఖ్యమైన కస్టమర్లకు సమాచారం అందించబడుతుందని, వారికి 30 రోజుల నోటీస్ పిరియడ్ క్లోజ్ చేయటానికి ముందు అందించబడుతుందని పేర్కొంది.
6. జూలై 1, 2024 నుంచి నిర్దిష్ట క్రెడిట్ కార్డ్‌లకు ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డ్ పాయింట్లను నిలిపివేస్తున్న ఎస్బీఐ కార్డ్స్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను తన అధికారిక వెబ్‌సైట్ లో వెల్లడించింది. ఇదే క్రమంలో మరో బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ జూలై 1 నుంచి వివిధ క్రెడిట్ కార్డ్ సేవలకు పునర్విమర్శలను ప్రకటించింది. అన్ని కార్డ్‌లపై (ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డ్ మినహా) కార్డ్ రీప్లేస్‌మెంట్ రుసుము రూ.100 నుంచి రూ.200 వరకు రివిజన్‌ను కలిగి ఉంటుంది.
7. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ గడువు జూలై 31, 2024తో ముగియనుంది. దేశంలోని పన్ను చెల్లింపుదారులు గడువులోపు సమర్పించటంలో విఫలమైతే లేటు రుసుముతో డిసెంబర్ 31, 2024లోపు రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications