January 1st Rules: జనవరిలో మారిపోతున్న రూల్స్ ఇవే.. తెలుసుకుని తెలివిగా మెలగండి..
January New Rules: ప్రతి నెల ప్రారంభంలో కొత్త నిబంధన అమల్లోకి వస్తుంటాయి. అయితే ఇవి సాధారణ ప్రజలపై ఆర్థికంగా కూడా ప్రభావితం చేస్తుంటాయి. ముందుగా వీటి ప్రభావాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 2024 కొత్త సంవత్సరంలో జనవరి 1 నుండి అమలు చేయబోయే కొత్త నిబంధనలను పరిశీలిస్తే..
- సిమ్ కార్డుల విషయంలో కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పేపర్ ఆధారిత కేవైసీ రిజిస్ట్రేషన్ పద్ధతుల స్థానంలో పేపర్‌లెస్ KYC సిస్టమ్ ప్రవేశపెట్టబడుతోంది. అయితే కొత్త మొబైల్ కనెక్షన్ల కొనుగోలు నిబంధనలలో ఎలాంటి మార్పు లేదు. అలాగే బ్యాంకుల్లో కేవైసీ సమర్పించేందుకు ఇకపై వాట్సాప్ లేదా ఈ-మెయిల్‌లో అవసరమైన వివరాలను పంపొచ్చు.

- మరీ ముఖ్యంగా యూపీఐ వినియోగదారులకు ముఖ్యమైన అప్ డేట్ ఉంది. NPCI ఆదేశాల మేరకు పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్లు ఏడాది నుంచి వినియోగంలో లేని యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయనున్నాయి. అందువల్ల నిర్థేశించిన కాలంలో ఒక్క ట్రాన్సాక్షన్ కూడా చేయని యూపీఐ ఐడీలను డిజిటల్ చెల్లింపులకు కొత్త ఏడాది నుంచి అందుబాటులో ఉండవని ఖాతాదారులు గుర్తుంచుకోవాలి.
- రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ప్రస్తుతం ఉన్న సిలిండర్ ధర రూ.500 నుండి రూ.450కి ఇవ్వబడుతుంది. దీంతో వినియోగదారులకు ఒక్కో సిలిండర్‌కు రూ.50ని అదనంగా ఆదా చేసుకోనున్నారు.
- ఆదాయపు పన్ను విషయంలో అత్యంత ముఖ్యమైన అప్‌డేట్ ఉంది. ఆలస్యపు రిటర్న్ లేదా సవరించిన పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31గా ఉంది. సాధారణంగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ అని గుర్తుంచుకోవాలి. అయితే గడువు లోపు రిటర్న్ దాఖలులో విఫలమైతే రూ.5,000 జరిమానా విధించబడుతుంది. కానీ సవరించిన రిటర్న్ ఫైలింగ్ ఉచితమే. సకాలంలో దాఖలు చేసిన పన్ను రిటర్న్ లలో తప్పులు లేదా లోపాలు ఉన్నట్లయితే వాటిని సవరించేందుకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.
- చివరగా కొత్త ఏడాదిలో బ్యాంక్ లాకర్ల నిబంధనలు మారుతున్నాయి. దీని ప్రకారం బ్యాంకుల్లో లాకర్లను కలిగి ఉన్న కస్టమర్లు రివైజ్డ్ బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అలా చేయడంలో విఫలమైతే మరుసటి రోజు వారి లాకర్లు నిలిపివేయబడతాయి. డిసెంబర్ 31లోగా ఈ ఒప్పందంపై సంతకం చేయాలని బ్యాంకులు ఖాతాదారులకు సూచించాయి.


Click it and Unblock the Notifications