Rules Changing from September: రేపటి నుంచి కొత్త నెల ప్రారంభం అవుతోంది. ఈ క్రమంలో అనేక ఆర్థికపరమైన, ముఖ్యమైన అంశాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మారుతున్న ఈ రూల్స్ మనల్ని ఎలా ప్రభావితం చేయనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మెుదటగా అన్నింటికంటే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే సెప్టెంబర్ 30 నుంచి రూ.2000 నోట్లు దేశంలో వినియోగంలో ఉండవు. వీటిని ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. అందువల్ల రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు నోట్లను గడువు నాటికి సమీపంలోని బ్యాంక్ సందర్శించి మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే గడువు తర్వాత కూడా ఇవి లీగల్ టెండర్ గా పరిగణించబడుతుందని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దీపావళి ఊరట అంటూ గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రూ.200 తగ్గింపును దేశ ప్రజలకు కానుకగా ప్రకటించింది. అయితే ప్రతినెల మాదిరిగానే సెప్టెంబరు 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గుతాయా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. సెప్టెంబరు 14 నుంచి ఉచితందా ఆధార్ వివరాలను అప్ చేసుకునే సౌకర్యానికి రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
IDBI బ్యాంక్ ప్రత్యేక FD పథకాన్ని అందిస్తోంది. ఈ 375 రోజుల FD పథకంలో సాధారణ ప్రజలు 7.10 శాతం వడ్డీని అందుకుంటారు. అలాగే సీనియర్ సిటిజన్ 7.60 శాతం వడ్డీని అందుకుంటారు. 444 రోజుల FD కింద సాధారణ పౌరులు 7.15 శాతం వడ్డీని.. సీనయర్ సిటిజన్లు 7.65 శాతం వడ్డీని పొందుతారని వెల్లడించింది. ఇదే క్రమంలో కెనరా బ్యాంక్ 3 డోర్‌స్టెప్ సర్వీస్‌పై ఎలాంటి ఛార్జీ తీసుకోదు. మీరు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని ఆగస్టు 31 వరకు పొందవచ్చు.
అలాగే సెప్టెంబరు నెలాఖరు నుంచి డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లకు సంబంధించిన రూల్స్ మారిపోతున్నాయి. వీటి అకౌంట్ హోల్డర్లు తమ నామినీలకు సంబంధించిన వివరాలను తప్పక సమర్పించాల్సిందిగా సెబీ వెల్లడించింది. అలాగే సెప్టెంబరు 30 వరకు సీనియర్ సిటిజన్ల కోసం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI WeCare ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని అందుబాటులో ఉంచుతోంది. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలవ్యవధిలో సీనియర్ సిటిజన్లు దీని కింద 7.5 శాతం వరకు వడ్డీ రేటును పొందుతారని తెలుస్తోంది.
స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులు 30 సెప్టెంబర్ 2023లోపు ఆధార్-పాన్ లింక్ చేయడం తప్పనిసరి చేయబడింది. గడువు నాటికి దీనిని పూర్తి చేయకపోతే మీ ఖాతా మూసివేయబడుతుంది. ఇక చివరగా Axis Magnus క్రెడిట్ కార్డ్ నిబంధనలు, షరతులు సెప్టెంబర్ 1, 2023 నుంచి మారుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లు రూ.1,50,000 వరకు మొత్తం నెలవారీ ఖర్చుపై ప్రతి రూ.200 లావాదేవీకి 12 ఎడ్జ్ రివార్డ్ పాయింట్‌లను పొందుతారు. అలాగే రుసుముల విషయంలోనూ మార్పులు చేసింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications