February Rules: ఫిబ్రవరి 1 నుంచి మారిపోతున్న నిబంధనలు ఇవే.. తెలుకోకుంటే నష్టమే..
Rules in February: ప్రతినెల మాదిరిగానే ఫిబ్రవరిలో వస్తున్న కొన్ని మార్పులు సామన్యుల జేబులపై ప్రభావం చూపనున్నాయి. వీటికి తోడు బడ్జెట్ ప్రసంగం సైతం ఫిబ్రవరి 1న ఉండటం చాలా మందిలో ఉత్కంఠకు దారితీస్తోంది.
గోల్డ్ బాండ్స్: ముందుగా బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు సంబంధించిన వార్త ఒకటి ఉంది. రిజర్వు బ్యాంక్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి చివరి విడత గోల్డ్ బాండ్ల విక్రయాన్ని ఫిబ్రవరి 12-16 మధ్య విక్రయిస్తోంది. గోల్డ్ బాండ్లలో ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ పద్ధతిలో పెట్టుబడి పెట్టే సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది.

NPS సొమ్ము విత్‌డ్రా: పెన్షన్ రెగ్యులేటర్ PFRDA నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి ఉపసంహరణ నిబంధనలలో మార్పులను ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తున్నాయి. వీటి ప్రకారం ఎన్‌పీఎస్ సభ్యులు పెన్షన్ ఖాతా నుంచి మొత్తంలో 25 శాతానికి మించి విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించరు. ఖాతాదారుడు తన వ్యక్తిగత పెన్షన్ ఖాతా నుంచి మాత్రమే మొత్తాన్ని విత్‌డ్రా చేయగలరు. యజమాని సహకారం నుంచి ఉపసంహరణ అనుమతించబడదు. అలాగే ఖాతా నుంచి గరిష్టంగా మూడు సార్లు మాత్రమే డబ్బును విత్‌డ్రా చేసుకోవటానికి వెసులుబాటు ఉంటుంది.
IMPS రూల్స్: లబ్ధిదారుని వివరాలు చేర్చకుండా తక్షణం డబ్బును ఆన్‌లైన్ పద్ధతిలో పంపించేందుకు వినియోగించే IMPS రూల్స్ మారుతున్నాయి. వీటి ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి ఈ పద్ధితిలో బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు పంపేందుకు పరిమితిని రూ.5 లక్షలకు పెంచటం జరిగింది. అలాగే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) బ్యాంక్ ఖాతా లావాదేవీలను వేగవంతం చేసేందుకు లబ్ధిదారుని సెల్‌ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా పేరును నమోదు చేయడం ద్వారా డబ్బును పంపవచ్చు.

Fastag రూల్స్: జనవరి 31 నాటికి దేశంలోని ప్రైవేట్ & వాణిజ్య వాహనాలలో ఇన్‌స్టాల్ చేయబడిన అన్ని ఫాస్టాగ్‌లకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రక్రియను పూర్తిచేయకపోతే వాహనానికి అమర్చిన ఫాస్టాగ్‌లో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఫిబ్రవరి 1 నుంచి పనిచేయవని వెల్లడించింది. అంటే కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవటంలో విఫలమైతే అవి డీయాక్టివేట్ అవుతాయి. అలాగే డ్రైవర్లు దీనికి జరిమానాగా టోల్ ప్లాజాలో నగదు రూపంలో టోల్ పన్నును అధికంగా చెల్లించవలసి ఉంటుంది.


Click it and Unblock the Notifications