October 1st Changes: ప్రతినెల మెుదటి రోజు అనేక అంశాలకు సంబంధించిన రూల్స్ మారుతుంటాయి. ఇవి ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో మన ఆర్థిక అంశాలను ప్రభావితం చేస్తుంటాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. దీనివల్ల మీ పెట్టుబడులు సైతం ప్రభావితం అవుతాయి.
మెుదటగా విదేశాలకు వెళ్లే వారి పన్ను విధానానికి సంబంధించిన మార్పు గురించి మనం మాట్లాడుకోవాలి. విదేశాలకు వెళ్లాలని మీరు ఇష్టపడుతున్నట్లయితే.. ఒక పెద్ద హెచ్చరిక ఉంది. అక్టోబర్ 1, 2013 నుంచి రూ.7 లక్షల కంటే ఎక్కువ విలువైన టూర్ ప్యాకేజీని కొనుగోలు చేస్తున్నట్లయితే దానిపై 20 శాతం టీసీఎల్ రూపంలో పన్ను చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. అయితే వైద్యానికి సంబంధించిన ఖర్చులు దీని నుంచి మినహాయించబడతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

రెండవది చిన్న పొదుపు పథకాలకు సంబంధించిన కీలకమైన అంశం. మీరు పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టినట్లతే ఈ అప్‌డేట్ మీకోసమే. మీరు పెట్టుబడులకు సంబంధించి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ చేసి సదరు కేవైసీ వివరాలను అందించాల్సి ఉంటుంది. అలా చేయకపోతే సంబంధిత పత్రాలు అందించేంత వరకు మీ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడుతుందని గుర్తుంచుకోండి.
అక్టోబర్ 1 నుంచి జనన మరణాల నమోదు(సవరణ) బిల్లు-2023 దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. దీని కారణంగా కొత్తగా ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ పొందడం, వివాహ నమోదు, ప్రభుత్వ ఉద్యోగంలో నియామకం, ఓటరు జాబితా లేదా అడ్మిషన్ కోసం జనన ధృవీకరణ ఒకే పత్రంగా చెల్లుబాటు అవుతుంది.
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు అతిపెద్ద అప్‌డేట్ ఉంది. నేటి నుంచి మ్యూచువల్ ఫండ్ SIP గరిష్టంగా 30 ఏళ్ల వరకు మాత్రమే చేయగలరు. ఇప్పుడు మీరు SIPని ఎంతకాలం కొనసాగిస్తారో ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. గతంలో దీర్ఘకాలిక SIPలకు ముగింపు తేదీ లేదు. పాత SIPలకు కొత్త నిబంధన వర్తించదు. NACH తన నోటిఫికేషన్‌ను 18 ఆగస్టు 2023న విడుదల చేసింది. అలాగే డీమ్యాట్ ఖాతాదారులు తమ నామినీ వివరాలను అందించని పక్షంలో ట్రేడింగ్ చేసేందుకు అనుమతి ఉండదని గుర్తుంచుకోండి.
చివరగా గుర్తించాల్సింది డెబిట్-క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో వచ్చిన మార్పుల గురించి. ఇకపై కార్డు జారీ చేసే బ్యాంక్ లేదా సంస్థ మీకు ఏ కార్డు కావాలో ముందుగా అడిగి తెలుసుకున్న తర్వాత మీ ఎంపిక మేరకు కార్డులను అందించాల్సి ఉంటుంది. కొత్త కార్డ్ పొందటం లేదా పునరుద్ధరణ సమయంలో కార్డు జారీ చేసే సంస్థలు రూపే, మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ మొదలైన వాటిలో ఏది కావాలో ముందుగా ఎంపిక చేసుకునే వెసులుబాటు కస్టమర్లకు ఇకపై అందించబడింది. ఈ రూప్స్ నేటి నుంచే అమలులోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications