ప్రతినెల రాబడి కావాలా..? రిస్క్ లేని నాలుగు పెట్టుబడి ఎంపికలు ఇవే..
Investment: 60 ఏళ్లు దాటిన తర్వాత ఆర్థిక అవసరాల కోసం ముందుగా ప్లాన్ చేసుకోవటం చాలా ముఖ్యం. పెన్షన్ ఆదాయం లేని వ్యక్తులు తప్పకుండా స్థిరమైన ఆదాయం పొందే మార్గాన్ని ఏర్పాటు చేసుకోవటం కీలకం. అలాంటి పెట్టుబడి మార్గాల గురించి తెలుసుకుందాం..
ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే యాన్యుటీ ప్లాన్‌లు పదవీ విరమణ తర్వాత తక్కువ రిస్క్‌తో కూడిన పెట్టుబడి ఎంపిక. డిఫర్డ్ యాన్యుటీ, తక్షణ యాన్యుటీ అనే 2 రకాల యాన్యుటీ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. పదవి విరమణ తర్వాత వెంటనే నెలవారీ ఆదాయం కావాలంటే తక్షణ యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. ముందుగా ఇన్వెస్ట్ చేసి కొంత కాలం తర్వాత స్థిర ఆదాయాన్ని కోరుకునే వారికి డిఫర్డ్ యాన్యుటీ ఆప్షన్ అనుకూలంగా ఉంటుంది. ఈ యాన్యుటీ ప్లాన్స్ సురక్షితమైనవి కూడా.

SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేసినట్లయితే.. పెట్టుబడి పెట్టిన మొత్తంలో వడ్డీ ఆదాయంతో పాటు ప్రతి నెలా కొంత మెుత్తాన్ని పొందడం. SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ప్రధాన మొత్తం + వడ్డీ రూపంలో ఏకమొత్తం పెట్టుబడి ద్వారా నెలవారీ ఆదాయాన్ని పొందుతారు. దీని కాలవ్యవధి 10 సంవత్సరాలు. ఇందులో సాధారణ ఇన్వెస్టర్లకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే మెచ్యూరిటీకి ముందే రూ.15 లక్షల వరకు డిపాజిట్లను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు విధించే జరిమానాతో సమానంగా జరిమానా విధించబడుతుంది. పైగా ఓడీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది 5 సంవత్సరాల కాలానికి నెలవారీ ఆదాయానికి హామీ ఇచ్చే స్కీమ్. ఈ పథకం ఏకమొత్తం పెట్టుబడిపై 7.40 శాతం వడ్డీని అందిస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఎలాంటి వయో పరిమితి లేదు కాబట్టి.. అన్ని వయస్సుల వారు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఐదేళ్ల తర్వాత ఈ మెుత్తం తిరిగి ఇవ్వడబడుతుంది.

చివరిగా మాట్లాడుకోవాల్సింది గ్యారెంటీడ్ రిటర్న్స్ ప్లాన్‌ల గురించి. ఇది మార్కెట్ అస్థిరతలతో సంబంధం లేకుండా స్థిరమైన, పన్ను-రహిత రాబడిని అందించే సురక్షితమైన పెట్టుబడి పద్ధతి. దీనికింద 7.5 శాతం వరకు వడ్డీ పొందవచ్చు. గ్యారెంటీడ్ రిటర్న్స్ SPU ప్లాన్‌లు పాలసీదారు మరణంపై ఆధారపడిన వారికి పొదుపుతో పాటు జీవిత బీమా కవరేజీని పొందడంతో వారికి ఆర్థిక రక్షణను అందిస్తాయి.


Click it and Unblock the Notifications