Telangana Elections: తెలంగాణ ఎన్నికల ఫలితాలు దేశంలో పెద్ద ఉత్కంఠకు దారితీసింది. నేడు ఫలితాలు విడుదలైన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ హవా కనిపించగా.. కేవలం తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అదరగొట్టింది.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లోనే గెలిచింది. అయితే సాయంత్రం 3.30 గంటల సమయంలో కాంగ్రెస్ 49 స్థానాల్లో గెలిచి దాదాపు 16 స్థానాల్లో విజయపరంపరను కొనసాగిస్తోంది. ఇక బీఆర్ఎస్ 18 చోట్ల గెలవగా 21 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ మీద ప్రేమ కంటే కేసీఆర్ కుటుంబ రాజకీయాలపైనే ప్రజలు ఎక్కువగా అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికల్లోని ధనిక అభ్యర్థులు ఎవరనే అంశంపై భారీగా ప్రజలు దృష్టి సారించారు. తెలంగాణ ఎన్నికల్లో రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులున్న అభ్యర్థుల సంఖ్య 270గా ఉంది. ఇదే క్రమంలో రూ.10 లక్షలలోపు ఆస్తులు ఉన్న అభ్యర్థులు 950 మంది ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఎన్నికల్లో మెుత్తంగా 2,290 మంది పాల్గొనగా వీరిలో 25 శాతం అంటే 580 మంది కోటీశ్వరులు ఉన్నట్లు వెల్లడైంది.
టాప్- 10 ధనవంతులైన అభ్యర్థులు.. వారి ఆస్తుల విలువను పరిశీలిస్తే..
1. కట్టం వివేకానంద (కాంగ్రెస్)- రూ.606 కోట్ల ఆస్తులు
2. గోమతిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి (కాంగ్రెస్)- రూ.458 కోట్ల ఆస్తులు
3. పొంగులేటి శ్రీనివాస రెడ్డి (కాంగ్రెస్)- రూ.433 కోట్ల ఆస్తులు
4. బైలా శేఖర్ రెడ్డి (బీఆర్ఎస్)- రూ.227 కోట్ల ఆస్తులు
5. కుంబం అనిల్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)- రూ.211 కోట్ల ఆస్తులు
6. కోట ప్రభాకర్ రెడ్డి (బీఆర్ఎస్)- రూ.197 కోట్ల ఆస్తులు
7. గాధం వినోద్ (కాంగ్రెస్)- రూ.197 కోట్ల ఆస్తులు
8. ఎం.రవి కుమార్ యాదవ్ (బీజేపీ)- రూ.171 కోట్ల ఆస్తులు
9. పాండి రమేష్ (కాంగ్రెస్)- రూ.160 కోట్ల ఆస్తులు
10. జగదీశ్వర్ గౌతమ్ (కాంగ్రెస్)- రూ.124 కోట్ల ఆస్తులు


Click it and Unblock the Notifications