Market Crash: మూడోరోజూ కుప్పకూలిన సెన్సెక్స్-నిఫ్టీ.. పతనానికి 5 కారణాలివే..!!
Stock Market Crash: దేశంలో ప్రజలు ఒకపక్క వినాయక చతుర్థి పండుగకు సిద్ధమౌతుండగా.. దలాల్ స్ట్రీట్ మాత్రం విధ్వంసంతో కుదేలైంది. వరుసగా మూడు రోజుల నుంచి మార్కెట్లు తమ పతనాన్ని చూస్తున్నాయి. ప్రధాన సూచీలు ఒక్కసారిగా బేర్స్ పంజాలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
ఈ క్రమంలో మధ్యాహ్నం 12.51 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 838 పాయింట్లు కోల్పోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 239 పాయింట్లు పతనాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 548 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 588 పాయింట్ల తగ్గుదలను చూసింది. ఈ క్రమంలో ప్రధానంగా 13 రంగాలకు చెందిన కంపెనీల షేర్లు నష్టాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ, ఎనర్జీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు బెంచ్ మార్క్ సూచీల పతనానికి దారితీశాయి.

ఈ క్రమంలో ఇండియా విక్స్ సూచీ 6 శాతం పెరిగి 15 పాయింట్లకు చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో దాదాపు 1,213 షేర్లు లాభపడగా, 2,083 షేర్లు నష్టాలను చూశాయి. అయితే 65 షేర్లలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. అయితే ఇప్పుడు అందరి చూపు మార్కెట్లను ఒక్కసారిగా ఇంత పతనానికి గురిచేస్తున్న అంశాలు ఏమిటనే తెలుసుకోవటంపై పడింది.
- ముందుగా ఈ నెలలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై సమావేశంలో తగ్గింపు ప్రకటన ఉంటుందా అనే అంశంపై కొనసాగుతున్న అనిశ్చితి మార్కెట్ల క్షీణతకు ఒక కారణంగా ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షకర్ పేర్కొన్నారు. 25 బేసిస్ పాయింట్ల కంటే ఎక్కువ తగ్గింపును గ్లోబల్ మార్కెట్లు ఊహిస్తున్నాయని అన్నారు. ఇటువంటి తరుణంలో తమ లాంగ్ పొజిషన్‌లను విక్రయించి తమను తాము రక్షించుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.
- గడచిన రెండు వారాలుగా మార్కెట్లలో తీవ్రమైన కొనుగోళ్లు కొనసాగటం మార్కెట్ల దిద్దుబాటుకు దారితీసిందని సీనియర్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ సీమా శ్రీవాస్తవ అన్నారు. ఓవర్ బాట్ తర్వాత ప్రస్తుత అమ్మకాలు కేవలం ప్రాఫిట్ బుకింగ్‌గా చూడాలని ఆయన సూచించారు.
- గత వారం అమెరికా ద్రవ్యోల్బణం సగటులో US డాలర్ ఇండెక్స్ 7 నెలల కనిష్ట స్థాయిని తాకి, 100 మార్క్‌ను దాటిన తర్వాత తిరిగి బౌన్స్ అవ్వడానికి సహాయపడిందని HDFC సెక్యూరిటీస్‌లో కమోడిటీస్ అండ్ కరెన్సీల హెడ్ అనూజ్ గుప్తా అన్నారు. ఈ క్రమంలో విదేశీ కరెన్సీలు, ట్రెజరీలు, బాండ్లకు డిమాండ్ పెరిగిందన్నారు.
- ఇక ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు అమెరికా జాబ్ డేటాపై అందరి దృష్టి ఉంది. జూలైలో ఉద్యోగ అవకాశాలు మూడున్నరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఇది US లేబర్ మార్కెట్‌లో మందగమనాన్ని ప్రేరేపించిందని ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్‌కు చెందిన నిపుణులు పేర్కొన్నారు. అమెరికా లేబర్ మార్కెట్‌లో మాంద్యం ఏర్పడుతుందనే భయం యూఎస్ ద్రవ్యోల్బణం గురించి మళ్లీ ఆందోళనలను లేవనెత్తింది.


Click it and Unblock the Notifications