Gold Price Review: అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల మారుతున్న ప్లానింగ్ లో భాగంగా వెండి, బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే రూ.72,000 మార్కుకు పసిడి చేరుకోగా.. వెండి రూ.85,000 దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఈ పరుగు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
కేవలం నెలన్నరలో పసిడి ధరల్లో పరుగులు సామాన్యులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ కాలంలో 24 క్యారెట్ల పసిడి ధర 9000లకు పైగా పెరిగి ప్రస్తుతం దేశంలో 72 వేల మార్కును అధిగమించింది. నిపుణుల అంచనా ప్రకారం పసిడి ధర రానున్న కాలంలో 10 గ్రాములకు రూ.75,000 మార్కును చేరుకున్న తర్వాత కరెక్షన్‌కు గురవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే ఈ లెక్కన పసిడి ధరల్లో దూకుడు మరింత కాలం కొనసాగనుందని తెలుస్తోంది. అయితే చాలా మందిలో పసిడి ధర 80 వేలకు చేరుకుంటుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

గడచిన మూడేళ్ల కాలంలో బంగారం ధరల పెరుగుదల విపరీతంగా ఉంది. ఈ క్రమంలో దేశంలోని విక్రయ ధరలను పరిశీలిస్తే.. ఏప్రిల్ 1,2021న బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,919 వద్ద ఉంది. కాగా సోమవారం ఏప్రిల్ 8, 2024న బంగారం గరిష్ట స్థాయి రూ.71279కి చేరుకుంది. కేవలం మూడేళ్ల కాలంలో దేశంలో బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.26,360 వృద్ధిని నమోదు చేసింది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ ధర మూడేళ్ల కాలంలో రూ.63,737 నుంచి రూ.17,759 పెరిగి ప్రస్తుతం రూ.81,497 వద్దకు చేరుకుంది.
అసలు బంగారం, వెండి ధరలు విపరీతంగా ఎందుకు పెరుగుతున్నాయ్ అనే విషయాన్ని గమనిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల తాజా కొనుగోళ్లు ఒక ప్రధాన కారణంగా కొనసాగుతున్నాయి. చైనా సెంట్రల్ బ్యాంక్ వరుసగా 16 నెలల పాటు బంగారాన్ని కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు జనవరిలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 8,700 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసింది. దాదాపు 18 నెలల్లో అతిపెద్ద నెలవారీ కొనుగోలు. మరో వైపు పశ్చిమాసియాలో ఇటీవలి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా విలువైన లోహాల ధరలు పెరగడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. ఫిబ్రవరిలో భారతదేశపు వెండి దిగుమతి 260% పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వెండి వినియోగదారు అయిన భారత్ గ్లోబల్ ధరలు మూడేళ్లలో గరిష్ట స్థాయికి చేరుకోవడానికి సహాయపడగలదని కెడియా కమోడిటీస్ ప్రెసిడెంట్ అజయ్ కెడియా అన్నారు. 2024 మొదటి రెండు నెలల్లో వెండి దిగుమతులు 2,932 టన్నులకు పెరిగాయి. UAE నుంచి తక్కువ సుంకాలు పెద్ద కొనుగోళ్లను ప్రోత్సహించాయి. ఈ ఏడాది దిగుమతులు 66% పెరుగుతాయని తాజా అంచనాల ద్వారా వెల్లడైంది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్‌లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications