Q3 Results: భారత మార్కెట్లలో బడ్జెట్ బ్రేక్ తర్వాత త్రైమాసిక ఫలితాల జోరు మళ్లీ మెుదలైంది. ఈరోజు కూడా కొన్ని కంపెనీలు తమ క్వార్టర్లీ రిజల్ట్స్ విడుదల చేశాయి.

టాటా కన్జూమర్..
రోజువారీ అవసరాలకు వినియోగంచే చాలా వస్తువులు టాటా కంపెనీకి సంబంధించినవే ఉంటుంటాయి. వీటిని తయారు చేసే టాటా కన్జూమర్ డిసెంబరు మాసంతో ముగిసిన త్రైమాసికానికి మంచి లాభాలను నమోదు చేసింది.
ఈ కాలంలో కంపెనీ లాభం 28 శాతం పెరిగి రూ.369 కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో రెవెన్యూ రూ.3,454 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.287 కోట్లుగా ఉంది.

టైటాన్ టైమ్ బాలేదా..?
దివంగత ఇన్వెస్టర్ రాకేష్ జున్ జున్ వాలాకు అత్యంత ఇష్టమైన కంపెనీ టైటాన్ అని మనందరికీ తెలుసు. ఆయనకు కాసుల వర్షం కురిపించిన ఈ కంపెనీ తాజా ఫలితాలు నిరాశకు గురిచేశాయి. ఈ క్రమంలో కంపెనీ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను గమనిస్తే లాభం 10 శాతం మేర తగ్గి రూ.904 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.1,004 కోట్లుగా ఉంది.

HDFC..
హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ తన మూడో త్రైమాసిక ఫలితాలను నేడు విడుదల చేసింది. కంపెనీ నికర లాభం 13 శాతం మేర పెరిగింది. దేశంలోని అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ HDFC డిసెంబర్ త్రైమాసికంలో రూ.3,690.80 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దీనికి ముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.3,260.69 కోట్లుగా నమోదైంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications