ITR Late Penalties: మార్చి 31, 2024తో గత ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. అయితే దీంతో పన్ను చెల్లింపుదారులకు తమ ఐటి రిటర్న్స్ దాఖలుకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో అందరూ తమ పన్ను పత్రాలను దాఖలు చేసే పనిలో ఉన్నారు.
31 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి వ్యక్తులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలుకు గడువు జూలై 31, 2024. అయితే దీనిని సకాలంలో పూర్తి చేయని పన్ను విభాగం వ్యక్తులకు రిమైండర్‌లను ప్రస్తుతం పంపిస్తోంది. చట్టప్రకారం ముందుగా తెలిపిన తేదీలోగా బాధ్యతలను సెటిల్ చేయడంలో విఫలమవడం లేదా ITR ఫైల్ చేయడంలో నిర్లక్ష్యం చేయడం వంటివి అధికారుల నుంచి జరిమానాలకు దారి తీస్తుందని గుర్తుంచుకోవాలి.

వాస్తవానికి సరైన ఐటీఆర్ ఫైల్ చేయటానికి చాలా శ్రమపడాల్సి ఉంటుంది. ఇందుకోసం వారి పెట్టుబడులు, పన్ను రాయితీలకు సంబంధించి క్లెయిమ్ పత్రాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం టాక్స్ నిపుణులు లేదా ఛార్టెడ్ అకౌంటెంట్లను సంప్రదించాల్సి ఉంటుంది. సక్రమంగా అవసరమైన మొత్తం సమాచారాన్ని కంపైల్ చేయడం, మునుపటి సంవత్సరంలో చేసిన ఖర్చుల రికార్డును నిర్వహించడానికి వీరి సహకారం చాలా ముఖ్యం. ఒకవేళ తప్పుడు రిటర్న్స్ ఫైల్ చేస్తే వాటికి సంబంధించి అధికారుల నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
ఐటీఆర్ ఫైలింగ్ ఆలస్యాలపై జరిమానాలు:
టాక్స్ పేయర్స్ ఆలస్యంగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసినప్పుడు వారి ఆదాయం ఆధారంగా జరిమానాలు విధించబడతాయి. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండే వ్యక్తులకు రూ.1000 ఆలస్య రుసుము ఉండగా.. ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువగా ఉండే వ్యక్తులపై రూ.5000 వరకు ఫైన్ ఉంది. దీనికి తోడు రిటర్న్ ఫైలింగ్ లేటు చేసినందుకు వడ్డీ ఛార్జీల రూపంలో జరిమానాలు ఉండొచ్చు. ఇది పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిన చట్టపరమైన బాధ్యత కాబట్టి పన్ను సమ్మతిని నిర్ధారించడం చాలా కీలకం. ఇక్కడ చెల్లించని పన్నులపై రోజుకు 1 శాతం చొప్పున వడ్డీ లెక్కించబడుతుంది.


Click it and Unblock the Notifications