Buying Gold: బంగారం అంటే గుర్తుకొచ్చేది ముందుగా భారతీయులే. పసిడి ప్రియులకు పెట్టింది పేరు ఇండియా. ఇక్కడి ఆచారాలు, అలవాట్లకు అనుగుణంగా ప్రతి శుభకార్యంలోనూ పసిడి, వెండి వంటి లోహాలు భాగంగా ఉంటుంటాయి.
భారతదేశంలో బంగారం, వెండి వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తుంటారు. అయితే దీనికి ముందు పసిడి ప్రియులు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా నగదుతో కొనుగోలుకు సంబంధించి గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాస్తవానికి ఇంట్లో నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ డబ్బు నిల్వ చేయకూడదని ప్రభుత్వం చెబుతోంది. అదే విధంగా మీరు బంగారం కొనుగోలు చేసేటప్పుడు సైతం నగదు చెల్లింపులకు సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో కొనుగోలుదారులు తమ పాన్, ఆధార్ వివరాలు అందించాల్సి ఉంటుంది.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(PMLA) 2002 ప్రకారం ఆభరణాలు, రత్నాలు, వజ్రాలు మొదలైన వాటి కొనుగోలు ప్రభుత్వ నిబంధనలను కొనుగోలుదారులు తప్పక అనుసరించాల్సి ఉంటుంది. డిసెంబర్ 28, 2021న వచ్చిన చట్టప్రకారం దేశంలోని ఆభరణాల వ్యాపారులు KYC నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. అంటే నిర్దిష్ట పరిమితికి మించి నగదు లావాదేవీల కోసం పాన్ లేదా ఆధార్ వివరాలను కస్టమర్ల నుంచి సేకరించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేసినప్పుడు బంగారు వ్యాపారులు సదరు ట్రాన్సాక్షన్స్ వివరాలను ప్రభుత్వానికి అందించాలని చట్టం చెబుతోంది.
వీటికి తోడు ఆదాయపు పన్ను చట్టం 1961 కింద నగదు లావాదేవీలకు సంబంధించిన నిబంధనలు ఇటీవల కఠినతరం చేయబడ్డాయి. అలాగే ఆదాయపు పన్ను చట్టం 1962 రూల్ 114B ప్రకారం రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బంగారం కొనుగోళ్లకు పాన్ వివరాలను అందించడం తప్పనిసరని న్యాయ సంస్థ ఖైతాన్ & కో భాగస్వామి స్తుతి గలియా చెప్పారు. ఇక్కడ రూ.2 లక్షలకు మించి చేసే ఎలాంటి చెల్లింపు అది నగదు రూపంలో లేదా డిజిటల్ రూపంలో చేసినా మీ పాన్ వివరాలను నగల వ్యాపారులకు తప్పక ఇవ్వాలి. నగల వ్యాపారులు ఎవరైనా తమకు వచ్చిన డబ్బు అనుమానాస్పదంగా అనిపిస్తే మాత్రమే అలాంటి చర్యలు తీసుకుంటారు.


Click it and Unblock the Notifications