Smart Invester: ముసలోడే కానీ మహానుభావుడు.. స్టాక్ మార్కెట్లో రూ.10 కోట్ల ఇన్వెస్టర్..! సలామ్..
Smart Invester: చాలా మంది ప్రస్తుతం పెద్దపెద్ద చదువులు చదువుకున్నప్పటికీ.. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనగానే ముఖం తేలేస్తుంటారు. అదొక పెద్ద గందరగోళం అని అంటుంటారు. కానీ ఈ స్టోరీ చూస్తే మీ మైంబ్ బ్లాంక్ అవ్వక మానదు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ట్విట్టర్లో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారిన ఒక వృద్ధ ఇన్వెస్టర్ గురించి. నిరాడంబరంగా కనిపిస్తూ తన స్టాక్ మార్కెట్లో పోర్ట్ ఫోలియో గురించి ఆయన చెప్పిన మాటలు సామాన్యులకు నోట్లో నుంచి మాట కూడా రాకుండా చేస్తున్నాయి. ఈ వీడియోలో ఆయన తాను హోల్డ్ చేస్తున్న కంపెనీల షేర్లు వాటి వివరాలు, వాటి నుంచి ప్రతి ఏడాది పొందే డివిడెండ్ ఆదాయం వింటే మనకు కళ్లు తిరక్క మానవండి బాబు.

ఆయన మాటల ప్రకారం ఎల్‌అండ్‌టి షేర్లలో రూ.80 కోట్లు, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లలో రూ.21 కోట్లు, కర్ణాటక బ్యాంకు షేర్లలో రూ.1 కోటి విలువైన షేర్లను తాను కలిగి ఉన్నట్లు వృద్ధుడు వెల్లడించాడు. పైగా తన పెట్టుబడుల నుంచి ప్రతి ఏటా రూ.6 లక్షలను డివిడెండ్ ఆదాయంగా స్వీకరిస్తున్నట్లు తెలిపాడు. ఇంత మెుత్తంలో సంపద కలిగి ఉన్నప్పటికీ ఆయన ఇప్పటికీ సాధారణ జీవితాన్ని గడపటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అయితే ఇదే క్రమంలో అసలు ఆయన చెబుతున్న డేటా ఎంత వరకు కరెక్ట్ అంటూ చాలా మంది సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో వీడియోపై స్పందిస్తూ క్యాపిటల్ మైండ్ సీఈవో అండ్ ఫౌండర్ దీపక్ షియోనీ కామెంట్ చేశారు. ఎల్ టి షేర్ల విలువ రూ.3.2 కోట్లు ఉంటుందని, ఇతర పెట్టుబడులు సైతం మంచి విలువను కలిగి ఉన్నవేనన్నారు. మెుత్తానికి సాధాసీదా జీవితయం గడుపుతున్న వృద్ధుడిని ఈ వయసులో వైరల్ చేయటం సరికాదని, ఆయన ముఖాన్ని వీడియోలో బ్లర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications