Monday Stocks: యుద్ధ మధ్య బ్రోకరేజ్ సోమవారం కొనమంటున్న 5 స్టాక్స్ ఇవే..!!

Israel-Iran War: ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అంశం మిడిల్ ఈస్ట్ టెన్షన్స్. అవును ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం రోజురోజుకూ ముదురుతోంది. ఈ విషయంలో నేరుగా పెద్దన్న అమెరికా కూడా ఇన్వాల్వ్ కావటంతో పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. ఇప్పుడిప్పుడే ద్రవ్యోల్బణ భారం నుంచి ఉపశమనం పొందుతున్న ప్రజలు ప్రస్తుత పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు.

గత నెలలో యూఎస్ ఫెడ్ ద్రవ్యోల్బణం అదుపులోకి రావటంతో వడ్డీ రేట్లను కత్తిరించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు యుద్ధం రూపంలో మరో సమస్య రావటంపై అటు సెంట్రల్ బ్యాంకులు, ఇటు మార్కెట్ ఇన్వెస్టర్లు పరిణామాలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ పరిస్థితుల్లో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలతో గతవారం భారతీయ మార్కెట్లు పెద్ద నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చమురు ధరలు తిరిగి భారీగా పెరుగుతున్నాయి. దీంతో మార్కెట్లలో అందరిచూపు ప్రస్తుతం చమురు రంగంలోని కంపెనీల షేర్లపై ఉంది.

Know Oil stocks that brokerages suggested to buy on monday

గడచిన వారం యుద్ధం ప్రభావంతో భారతీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 4 శాతానికి పైగా పతనాన్ని నమోదు చేశాయి. రూపాయి ధర పతనం ప్రభావం కూడా కనిపిస్తోంది. చమురు స్టాక్స్ ధరలలో మరింత క్షీణత కనిపించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితి మెరుగుపడిన వెంటనే ఈ చమురు నిల్వలు మళ్లీ పుంజుకుంటాయని నిపుణులు అంటున్నారు. ఆయిల్ స్టాక్స్‌లో పందెం వేయాలని నిపుణులు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నారు. సోమవారం ఇన్వెస్టర్లు కొనుగోలు చేయదగిన కంపెనీల షేర్ల గురించి చెబుతూ..

- ప్రస్తుతం గంధార్ ఆయిల్ రిఫైనరీ షేర్లు తక్కువ విలువ వద్ద అందుబాటులో ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థ వీఎల్ఏ అంబాలా వెల్లడించింది. కంపెనీ షేర్లను రూ.210-215 మధ్య స్థాయిలో కొనుగోలు చేయవచ్చని ఇన్వెస్టర్లకు సూచించింది. స్టాప్ లాస్ ఒక్కో షేరుకు రూ.200గా సూచిస్తూ.. ఈ స్టాక్‌ను ఒక వారం నుండి 8 వారాల వరకు ఇన్వెస్టర్లు హోల్డ్ చేయవచ్చని వెల్లడించింది.

- ఇదే క్రమంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేయవచ్చని ఎస్ఎస్ వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు సుగంధ సచ్‌దేవా పేర్కొన్నారు. ఈ షేరును రూ.510 స్థాయి వద్ద కొనుగోలు చేయవచ్చన్నారు. అలాగే మధ్య కాలానికి అతను టార్గెట్ ధరను రూ.665 నుంచి రూ.680గా నిర్ణయించారు.

- అలాగే వీఎల్ఏ అంబాలా ప్రకారం పెట్రోనెట్ ఎల్ఎన్జీ కంపెనీ షేర్లు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయటానికి అనుకూలంగా ఉన్నాయి. ఒక్కో షేరును రూ.340-350 మధ్య స్థాయిలో కొనుగోలు చేయవచ్చని బ్రోకరేజ్ పేర్కొంది. రూ.310ని స్టాప్ లాస్ ధరగా ఉంచుకుంటూ.. రూ.370-430 టార్గెట్ ధర కోసం ప్రయత్నించాలని సూచించింది.

- ప్రభుత్వ యాజమాన్యంలోని బీపీసీఎల్ కంపెనీ షేర్లపై కూడా బెట్టింగ్ వేసేందుకు మంచి సమయంగా బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి. ఇన్వెస్టర్లు రూ.290-310 స్థాయిలో షేర్లను తమ పోర్ట్ ఫోలియోలో చేర్చుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ఈ క్రమంలో రూ.365-450 మధ్య టార్గెట్ ధరగా పేర్కొన్నారు. అలాగే షేరుకు స్టాప్ లాస్ ధరగా ఇన్వెస్టర్లు రూ.265 ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

- ఇక చివరిగా ఇన్వెస్టర్లు సోమవారం కొనుగోలు చేసేందుకు బ్రోకరేజ్ సూచించబడిన స్టాక్ ఓఎన్జీసీ. ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ కంపెనీ షేర్లను రూ.255-276 మధ్య స్థాయిలో కొనుగోలుకు అవకాశం ఉందని వీఎల్ఏ అంబాలా వెల్లడించింది. ఈ క్రమంలో స్టాక్ టార్గెట్ ధరను రూ.310-370 మధ్య ఉంచుకుండూ స్టాప్ లాస్ ధరను రూ.240గా పరిగణించాలని ఇన్వెస్టర్లకు సూచించింది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+