Ratan Tata Passed: కోట్ల మంది యువతకు రోల్ మోడల్. నిజంగా చెప్పుకోవాలంటే శత్రువులే లేని వ్యాపారవేత్త రతన్ టాటా అని చెప్పుకోవచ్చు. అయితే 86 ఏళ్ల టాటా నిన్న రాత్రి తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడవటం దేశంలోని ప్రతిఒక్కరినీ కలచివేస్తోంది. దీనిపై వ్యాపార ప్రపంచంలో దిగ్గజాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖుల వరకు అందరూ సంతాపం తెలియజేస్తున్నారు.
రతన్ టాటా జీవిత చరిత్ర తెలుసుకోండి..!
రతన్ టాటా దేశంపై చెరగని ముద్రవేశారని టాటా గ్రూప్ అధిరిక ట్విట్టర్ పేజీలో వెల్లడించింది. రతన్ నావల్ టాటాకు వీడ్కోలు పలకడం అత్యంత బాధాకర విషయంగా చంద్రశేఖరన్ పేర్కొన్నారు. టాటాగ్రూప్ రతన్ టాటా సారధ్యంలో అనేక కొత్త శిఖరాలకు చేరుకుంది. ఈ క్రమంలో ఇండియన్ బ్రాండ్ నుంచి గ్లోబల్ బ్రాండ్ స్థాయికి కంపెనీ విస్తరించింది. టెట్లీ, కోరస్, జాగ్వార్ లాండ్ రోవర్, బ్రన్నర్ మోండ్, జనరల్ కెమికల్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ వంటి కంపెనీలను కొనుగోలు చేసి టాటా గ్రూప్ కిందకు తీసుకొచ్చారు. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహించినప్పటికీ ప్రస్తుతం రతన్ టాటా సంపద విలువ రూ.3600 కోట్లుగా ఉంటుందని అంచనా వేయబడింది.

ఇప్పటికే 2017లో హోల్డింగ్ టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తు నాయకత్వం టాటా కుటుంబం నుంచి ఎవరు ఈ మహా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహించటానికి వస్తారనే ప్రశ్న తలెత్తింది. ఇప్పటికే టాటాల కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు వివిధ గ్రూప్ వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రముఖ వ్యక్తిగా పరిగణలో ఉన్నారు. దీనికి తగినట్లుగానే ఆయన గ్రూప్ వ్యాపారాల్లో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నారు.
ఇదే క్రమంలో టాటా గ్రూప్ విస్తారమైన వ్యాపారంలో నోయెల్ టాటా ముగ్గురు పిల్లలు కూడా భవిష్యత్తు వారసుల జాబితాలో ఉన్నారు. మాయా టాటా, నెవిల్లే టాటా, లేహ్ టాటా నోయెల్ టాటా వారసులు. 34 ఏళ్ల మాయా టాటా.. టాటా ఆపర్చునిటీస్ ఫండ్, టాటా డిజిటల్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాటా న్యూ యాప్‌ను ప్రారంభించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. అలాగే 32 ఏళ్ల నెవిల్లే టాటా.. స్టార్ బజార్ హైపర్ మార్కెట్ చైన్ బాధ్యతలు చూస్తున్నారు. ఇదే క్రమంలో 39 ఏళ్ల లేహ్ టాటా.. తాజ్ హోటల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్, ఇండియా హోటల్స్ వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications