Kavya Maran: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ సంపద ఎంతో తెలుసా..??
SRH News: ఐపీఎల్ సీజన్లో ఎక్కువగా వైరల్ అయ్యే పేరు కావ్య మారన్. ఆమె ఫ్యాన్స్ మాత్రం ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటుంటారు. ఇంటర్నెట్‌లో ఈమెకు అభిమానులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు.
వాస్తవానికి కావ్య మారన్ ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ-యజమాని. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంపాటలో సైతం తగ్గేదేలే అన్నట్లుగా ఆమె కోట్లు కుమ్మరించి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తమిళనాడులో అతిపెద్ద వ్యాపారసంస్థ సన్ గ్రూప్ కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. ప్రస్తుతం చాలా మంది ఆమె నికర విలువతో పాటు మరిన్ని విషయాలను తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.

సన్ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడిగా పనిచేస్తున్న బిలియనీర్ మీడియా మొగల్ కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ 2018లో ఫ్రాంచైజీకి CEO పాత్రను స్వీకరించారు. ఆమె ఆగస్టు 6, 1992న చెన్నైలో కళానిధి, కావేరీ మారన్ దంపతులకు జన్మించారు. ఆమె తల్లి కావేరీ మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ రిస్ట్రిక్టెడ్ CEOగా పని చేస్తున్నారు. దీనికి తోడు కావ్య కుటుంబంలో డిఎంకె పార్టీతో సంబంధం ఉన్న ఆమె మామ దయానిధి మారన్‌తో సహా ప్రఖ్యాత రాజకీయ నాయకులు ఉన్నారు. పైగా ఆమె తండ్రి కళానిధి మారన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధికి మనవడు కూడా.
పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కారణంగా కావ్య మారన్ నికర విలువ గణనీయంగా ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆమె నికర విలువ రూ.409 కోట్లుగా అంచనా వేయబడింది. అలాగే ఆమె తండ్రి కళానిధి మారన్ తమిళనాడు IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2019లో రూ.19,000 కోట్ల నికర విలువతో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. వృత్తిపరంగా ఐపీఎల్‌తో పాటుగా కావ్య సన్ టీవీ నెట్‌వర్క్ వ్యాపార కార్యకలాపాల్లో సైతం చురుకుగా పాల్గొంటున్నారు. ఆమె చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీ నుంచి కామర్స్ డిగ్రీతో పాటు UKలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి MBA పట్టా పొందారు.


Click it and Unblock the Notifications