Stock Market: 2024లో స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఇదే.. తెలుసుకుని డబ్బు ఇన్వెస్ట్ చేయండి..
Market Outlook: ప్రస్తుతం ఉన్న హై వాల్యుయేషన్లు, స్టాక్ మార్కెట్ అనిశ్చితులతో ఇన్వెస్టర్లు కొంత ఆందోళనల్లో ఉన్నారు. మరో పక్క బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్ని సూచించటం కలకలం రేపుతోంది.
రానున్న కొత్త ఏడాదిలో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ఉంటాయనే అంచనాలు పెట్టుబడిదారులకు పెద్ద ఊరటను అందించే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో నిఫ్టీ సూచీ 10-12 శాతం రాబడులను అందిస్తుందని అంచనా. ఈ క్రమంలో డిసెంబర్ 2024 నాటికి నిఫ్టీ సూచీ 23,600 మార్కును అందుకుంటుందని తెలుస్తోంది. అయితే గరిష్ఠంగా 25,000 పాయింట్ల మార్కును అందుకోవచ్చని ప్రస్తుతం నిపుణులు అంచనా వేస్తున్నారు.

వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ, ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు, బలమైన కార్పొరేట్ ఆదాయ వృద్ధి కారణంగా వాల్యుయేషన్‌ను కొనసాగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం సడలింపులు ర్యాలీకి దోహదబడతాయని తెలుస్తోంది. వీటికి తోడు మార్కెట్లలో ఎన్నికల ర్యాలీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల తగ్గుదల కూడా ఈక్విటీ మార్కెట్ల పురోగతికి దోహదపడతాయని తెలుస్తోంది. అలాగే సెకండరీ మార్కెట్ కోసం CY23లో అస్థిరమైన FIIల ఇన్‌ఫ్లో తిరిగి వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే ఎలివేటెడ్ వాల్యుయేషన్స్, నెమ్మదిగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈక్విటీలో లాభాల స్థాయిని పరిమితం చేసే అవకాశం ఉంది. అలాగే బంగారం, వెండి వంటి విలువైన లోహాల పెరుగుదల కూడా డాలర్ బలహీనపడుతుందనే సంకేతాలను అందిస్తోంది. ప్రధానంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు 2024లో వడ్డీ రేట్లను మూడుసార్లు తగ్గించవచ్చనే అంచనాల మధ్య తిరిగి గోల్డ్ పుంజుకుంటోంది. అలాగే ఈక్విటీల్లో ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్ మంచి ఫలితాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకులు, తయారీ, సిమెంట్, రసాయనాలు, నిర్మాణం, ఇన్‌ఫ్రా, ఫార్మా ఇందులో పాల్గొననున్నాయి.


Click it and Unblock the Notifications