గంటకు రూ.67 కోట్లు ఆదాయం.. ఈయన ముందు అంబానీ-అదానీ కూడా దిగదుడుపే..!
Jeff Bezos: ప్రపంచంలో కుబేరులకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు ప్రజలు ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతూనే ఉంటారు. వారు ఎంత సంపాదిస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు, ఎలా ఖర్చు చేస్తున్నారు వంటి అంశాలపై ప్రజల్లో నిరంతరం ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో అంబానీ, అదానీలను మించిన సంపాదన కలిగిన వ్యక్తి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..
ఒక వ్యక్తి గంటకు ఏకంగా రూ.67 కోట్లు సంపాదించటం అంత సులువేమీ కాదు. అయితే దీనిని నిజరూపంలోకి మార్చిన వ్యక్తి ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్నుడిగా ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ గురించే. గంటగంటకు పెరిగే ఆదాయం భారత కుబేరులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2024లో బెజోస్ ఆదాయం గంటకు 8 మిలియన్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం దీని విలువ రూ.67.2 కోట్లుగా ఉంది. ప్రధానంగా ఆయనకు అమెజాన్ కంపెనీలో ఉన్న 10 శాతం వాటాల నుంచి ఆదాయం వస్తుందని వెల్లడైంది.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బెజోస్ చాలా కాలంగా కంపెనీ నుంచి వేతనం రూపంలో చాలా తక్కువ మెుత్తాన్ని స్థిరంగా పొందుతున్నారు. సాధారణ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఇక్కడ అంశం బెజోస్ వార్షిక వేతనం కేవలం ఏడాదికి అక్షరాలా 80 వేల డాలర్లు. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.70 లక్షల వరకు ఉంటుంది. ఇది గంటకు జెఫ్ బెజోస్ సంపాదిస్తున్న గంట ఆదాయం కంటే 100 రెట్లు తక్కువ కావటం గమనార్హం. కంపెనీలో వాటాలను హోల్డ్ చేయటం వల్ల ఉంటే పెద్ద ప్రయోజనాన్ని బెజోస్ ప్రపంచానికి అర్థమయ్యేలా చేశారు.
ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో రెండవ వ్యక్తిగా ఉన్న బెజోస్ సంపద దాదాపు రూ.250 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇది అంబానీ సంపద 97 బిలియన్ డాలర్ల కంటే రెండింతలు ఎక్కువ. అలాగే మరో భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద కంటే మూడురెట్లు అధికం కావటం గమనార్హం. దీనంతటికీ మూలం 1994లో చిన్న గ్యారేజీలో బెజోస్ అమెజాన్ కంపెనీని ప్రారంభించటమే. మెుదట్లో ఇది ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌గా ప్రారంభమైనప్పటికీ.. తర్వాతి కాలంలో రిటైల్, ఈకామర్స్ రంగాల్లో పెద్ద విజయాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సంగతి తెలిసిందే.
2021 జూలైలో జెఫ్ బెజోస్ అమెజాన్ కంపెనీ సీఈవో స్థానం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన ఇతర వ్యాపార ఆలోచనలపై తన ఫోకస్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బెజోస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న జూవిష్ వ్యక్తిగా ఖ్యాతిగాంచారు. సామాన్యమైన జీవితం నుంచి ప్రపంచంలోనే విజయవంతమైన వ్యక్తిగా సాగిన జెఫ్ బెజోస్ ప్రయాణం అనేక మంది వ్యాపారవేత్తలకు స్పూర్తిదాయకం. పట్టుదలతో దైర్యంగా ముందుకు సాగితే విజయం సాధించటం సులువేనని బెజోస్ నిరూపించారు.


Click it and Unblock the Notifications