Infosys Vs TCS: ఐటీ దిగ్గజాల Q4 ఫలితాలు బయటకు.. ఎవరు బలంగా ఉన్నారంటే.. ఇన్వెస్టర్స్ చూస్కోండి
Infosys Vs TCS: టీసీఎస్, ఇన్ఫోసిస్ రెండూ ఐటీ మార్కెట్లో దిగ్గజాలే. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ రంగంలో పరిణామాలు రోజు రోజుకూ దిగజారుతున్నాయి. ఆర్థిక వ్యవస్థల్లో అనిశ్చితులు ఇందుకు కారణాలుగా ఉన్నాయి. తాజాగా ఈ రెండు కంపెనీలు తమ క్యూ4 ఫలితాలను మార్కెట్లోకి విడుదల చేశాయి.
భారత ఐటీ సేవల రంగం విలువ 245 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో ప్రత్యర్థులైన టీసీఎస్, ఇన్ఫోసిస్ భారీ వ్యాపారాన్ని కలిగి ఉన్నాయి. ఈ వారం రెండు కంపెనీలు తమ నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేశాయి. ఈ రెండు కంపెనీలు మార్కెట్ల అంచనాలను అందుకోవటంలో మిస్ అయ్యాయి. ఈ క్రమంలో టీసీఎస్ రూ.11,530 కోట్ల లాభాల అంచనాకు గాను రూ.11,392 కోట్లను ఆర్జించింది. ఇన్ఫోసిస్ రూ.6,613 కోట్లను ఆర్జిస్తుందని అంచనా వేయగా చివరికి రూ.6,128 కోట్ల లాభాన్ని ప్రకటించింది.

ఆదాయ ఆర్జన విషయానికి వస్తే టీసీఎస్ 16.9 శాతం వృద్ధితో రూ.59,160 కోట్లను నమోదు చేసింది. ఇదే క్రమంలో ఇన్ఫోసిస్ రెవెన్యూ 16 శాతం పెరిగి రూ.37,441 కోట్లను ఆర్జించింది. టీసీఎస్ Q4FY23లో టాప్‌లైన్ మరియు బాటమ్‌లో రెండంకెల వృద్ధిని నమోదు చేయగలిగింది. ఈ క్రమంలో ఇన్ఫోస్స్ జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో 10 బిలియన్ డాలర్లతో బలమైన ఆర్డర్ బుక్ కలిగి ఉండగా.. ఇన్ఫోసిస్ 2.1 బిలియన్ డాలర్ల ఆర్డర్ బుక్ కలిగి ఉంది.

ఇక డివిడెండ్ విషయానికొస్తే టీసీఎస్ ఒక్కో షేరుకు రూ.24 చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇన్ఫోసిస్ ఒక్కో షేరుకు రూ.17.50 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఐటీ మేజర్ టీసీఎస్ 6.15 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉండగా.. ఈ క్రమంలో 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ 3.43 లక్షల మందిని కలిగి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో టీసీఎస్ షేర్లు రూ.3,192 వద్ద ఉండగా.. ఇన్ఫోసిస్ షేర్లు రూ.1,383.40 వద్ద ఉన్నాయి.



Click it and Unblock the Notifications