AP Budget: నేడు ఏపీ సర్కార్ ప్రకటించిన బడ్జెట్లో హైలైట్స్ ఇవే.. ఎవరెవరికి ఎంతంటే..
AP Budget 2024 Highlights: ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ సమర్పించారు. ఈ క్రమంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు 62 శాతం మంది వ్యవసాయ అనుబంధ రంగంపై ఆదారపడి ఉండటంతో ఈ రంగానికి రూ.43,402 కోట్లను కేటాయించారు. ఇక ఏఏ రంగానికి ఎంతెంత నిధులు అలాట్ చేయబడ్డాయని పరిశీలి బడ్డెట్ హైలైట్స్ పరిశీలిస్తే..
- జలవనరులు-రూ.16,705 కోట్లు
- వ్యవసాయశాఖ-రూ.11,855 కోట్లు
- వైద్యారోగ్యశాఖ-రూ.18,421 కోట్లు
- పాఠశాల విద్య-రూ.29,909 కోట్లు
- ఉన్నత విద్య-రూ.2,326 కోట్లు

- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి-రూ.16,739 కోట్లు
- పురపాలక, పట్టణాభివృద్ధి-రూ.11,490 కోట్లు
- గృహనిర్మాణం-రూ.4012 కోట్లు
- పోలీస్‌శాఖ-రూ.8,495 కోట్లు
- బీసీ వెల్ఫేర్-రూ.39,007 కోట్లు
- ఎస్సీ సంక్షేమం-రూ.18,497 కోట్లు
- ఎస్టీ సంక్షేమం-రూ.7,557 కోట్లు
- మైనార్టీ సంక్షేమం-రూ.4,376 కోట్లు
- మహిళాశిశు సంక్షేమశాఖ-రూ.4,285 కోట్లు
- రోడ్డు, భవనాలశాఖ-రూ.9,554 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్యశాఖ-రూ.3,127 కోట్లు
- ఇంధనశాఖ-రూ.8,207 కోట్లు
- స్కిల్ డెవలప్‌మెంట్-రూ.1,215 కోట్లు
- యువజన, పర్యాటక, సాంస్కృతికశాఖ-రూ.322 కోట్లు
- పర్యావరణ, అటవీశాఖ-రూ.687 కోట్లు
ఇదే క్రమంలో రాజధాని అమరావతి నిర్మాణంపై కూడా కూటమి ప్రభుత్వం దృష్టి కొనసాగుతోంది. ఈ క్రమంలో మూలధన వ్యయం రూ.31,762 కోట్లుగా ఉండగా.. జీడీపీలో ద్రవ్యలోటు 2.12 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోర్ట్ ఫోలియోలో ఉన్న పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధికి రూ.16,739 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది.
నారా లోకేష్ విద్య, ఐటీ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకట్టుకునే క్రమంలో అమెరికాలో పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో నైపుణ్య గణన విధానాన్ని మంత్రి లోకేష్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యాల్లో శిక్ష ఇచ్చేందుకు దీనిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా బడ్జెట్ ప్రకటనలో మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శాఖకు రూ.1,215 కోట్లు కేటాయించబడ్డాయి.


Click it and Unblock the Notifications