Suzlon Energy share: రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ఉన్న సుజ్లాన్ కంపెనీ షేర్లపై రిటైల్ ఇన్వెస్టర్లు చాలా కాలంగా తమ మక్కువను చూపుతూనే ఉన్నారు. తక్కువ రేటులో ఉన్నప్పటి నుంచి షేర్లపై బెట్టింగ్ చేస్తున్న ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ రంగంపై భారత ప్రభుత్వ దృష్టి సారించిన వేళ పెట్టుబడుల ప్రవాహం ఈ రంగంలోని కంపెనీల షేర్లలో పెరుగుతూనే ఉంది.
సుజ్లాన్ ఎనర్జీ షేర్లు గడచిన ఏడాదిలో ఇన్వెస్టర్లకు 259% రాబడిని అందించాయి. అలాగే రెండేళ్లలో 856% మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. ఈ క్రమంలో శుక్రవారం మార్కెట్ల ముగింపు నాటికి స్టాక్ 1.65% లాభపడి రూ.78.84 వద్ద స్థిరపడ్డాయి. గత ఏడాది ఆగస్టు 14న సుజ్లాన్ ఒక్కో షేరు ధర రూ.21.26కు పడిపోయి 52 వారాల కనిష్ఠాన్ని చూసింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు స్టాక్ 271 శాతం పెరుగుదలను చూసింది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు సైతం కంపెనీ షేర్లపై తమ అంచనాలను ప్రకటిస్తున్నాయి. ఇవి ఇప్పటికే షేర్లను హోల్డ్ చేస్తున్న లేదా కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న ఇన్వెస్టర్లకు మార్గదర్శకంగా నిలుస్తాయి.

- ముందుగా సుజ్లాన్ స్టాక్ కొత్త గరిష్ఠాలను చేరుకోవటం బలమైన బుల్లిష్ ట్రెండ్‌ను సూచిస్తుందని చాయిస్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎనలిస్ట్ మందార్ భోజానే అన్నారు. కంపెనీ షేర్లను హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు దీర్ఘకాలానికి రూ.100-140 టార్గెట్ ధరను అందించింది. స్వల్పకాలిక వ్యాపారులు దాదాపు రూ.85-90 స్థాయిల బుకింగ్ లాభాలను పరిగణించవచ్చని పేర్కొంది. అయితే ప్రస్తుతం స్టాక్ రూ.68 వద్ద తక్షణ సపోర్ట్ కలిగిఉన్నట్లు బ్రోకరేజ్ వెల్లడించింది.
- ఇదే క్రమంలో స్టాక్ బాక్స్ టెక్నికల్ అనలిస్ట్ కుశాల్ గాంధీ మాట్లాడుతూ సుజ్లాన్ ఎనర్జీ ప్రస్తుతం అధిక వాల్యుయేషన్‌తో ట్రేడవుతోందని అన్నారు. రానున్న సమీప భవిష్యత్తులో ఎనర్జీ స్టాక్ ప్రాఫిట్ బుకింగ్ పొందటానికి అధిక సంభావ్యతను సూచిస్తుందన్నారు.
- ఇదే క్రమంలో కంపెనీ షేర్లు రూ.92 వద్ద మెుదటి రెసిస్టెన్స్ ఎదుర్కొంటాయని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ వెల్లడించారు. అలాగే స్టాక్ రూ.100 మార్కును చేరుకునేందుకు ర్యాలీని ఆశించవచ్చని తెలిపారు. అలాగే రూ.64 కంపెనీ షేర్లకు సపోర్ట్ జోన్ గా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు.
- విండ్ టర్బైన్ల తయారీ షేర్లు రానున్న కొన్ని నెలల్లో రూ.94-102 స్థాయికి చేరుకోవచ్చని శాంక్టమ్ వెల్త్ హెడ్ డెరివేటివ్స్ & టెక్నికల్ ఆదిత్య అగర్వాల్ వెల్లడించారు. స్టాక్ ఓవర్‌బాట్ జోన్‌లో ఉందని, దాని తక్షణ రెసిస్టెన్స్ జోన్ రూ.80-82 దగ్గర ట్రేడవుతుందన్నారు. అలాగే లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు రూ.68-70 స్థాయి కొనుగోళ్లకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications