For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: పరుగులు పెడుతున్న పసిడి.. కరోనా కేసులతో పైపైకి.. ఇప్పుడు కొనొచ్చా..?

|

Gold Price Today: అంతర్జాతీయ మార్కెట్లలోని పరిణామాలు గోల్డ్ ధరలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. చైనా, తైవాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా మార్చేస్తున్నాయి. దీనికి తోడు ఇతర కారణాలతో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతున్నారు.

డిసెంబర్ 27 ధర..

డిసెంబర్ 27 ధర..

సానుకూల ప్రపంచ పవనాల మధ్య మంగళవారం బంగారం ధర ఎక్కువగా ట్రేడవుతోంది. ఈ క్రమంలో వెండి ధర కూడా 0.25 శాతం పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.76 లేదా 0.14% పెరిగి 10 గ్రాములకు రూ.54,753 వద్ద ట్రేడవుతున్నాయి. అలాగే MCXలో వెండి ఫ్యూచర్స్ కిలో రూ.175 పెరిగి రూ.69,250 వద్ద ట్రేడవుతోంది. డాలర్ దూకుడు తగ్గటం కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తోంది.

సోమవారం బంగారం..

సోమవారం బంగారం..

గ్లోబల్ మార్కెట్ల నుంచి సంకేతాలు లేకపోవడంతో సోమవారం బంగారం , వెండి ధరలు పక్కదారి పట్టాయి. మిశ్రమ US ఆర్థిక డేటా, ముడి చమురు లాభాల తర్వాత బులియన్లు శుక్రవారం వారి కనిష్ఠ స్థాయిల నుంచి కోలుకున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును నెమ్మదింప చేస్తుందని మార్కెట్లు ఆశతో ఉన్నాయి. అయితే ఈ క్రమంలో బంగారం ధర రూ.55,000 స్థాయిని తిరిగి చేరుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు.

మందంగా ట్రేడింగ్..

మందంగా ట్రేడింగ్..

సుదీర్ఘ క్రిస్మస్ వారాంతం తర్వాత ట్రేడింగ్ కొంత మందగించింది. అంతర్జాతీయంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ.. ఆందోళనల మధ్య సురక్షితమైన స్వర్గధామంగా ఉన్న బంగారం డిమాండ్ బలంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలు..

ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలు..

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు దేశంలోని అనేక నగరాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో రూ.54,480, విజయవాడలో రూ.54,480, బెంగళూరులో రూ.54,510, చెన్నైలో రూ.55,480, దిల్లీలో రూ.54,630, ముంబైలో రూ.54,480, కోల్‌కతాలో రూ.54,480 కొనసాగుతున్నాయి.

వెండి ధరలు ఇలా..

వెండి ధరలు ఇలా..

కిలో వెండి ధర హైదరాబాద్ నగరంలో రూ.74,000, విజయవాడలో రూ.74,000, ముంబై చెన్నైలో రూ.71,100, కోల్‌కతాలో రూ.74,100 వద్ద ఉన్నాయి.

Read more about: gold silver investment business news
English summary

Gold Price Today: పరుగులు పెడుతున్న పసిడి.. కరోనా కేసులతో పైపైకి.. ఇప్పుడు కొనొచ్చా..? | Know latest Gold and Silver rates, can users buy for investing now

Know latest Gold and Silver rates, can users buy for investing now
Story first published: Tuesday, December 27, 2022, 12:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X